36.1 C
India
Saturday, May 4, 2024
More

    Team India : ఆఖరికి విండీస్ పైనా ఓటమి.. టీమిండియా కప్పులు కొట్టుడు కష్టమేనా..?

    Date:

    Team India
    Team India

    Team India : యువ ఆటగాళ్లతో నిండిపోయిన టీమిండియా వరుస వైఫల్యాలతో అభిమానుల్లో నిరాశను మిగుల్చుతున్నది. సీనియర్లంతా ఒకరితర్వాత ఒకరు రిటైర్మెంట్ ప్రకటించగా, ఇక ఇప్పటికైతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రమే జట్టులో మిగిలిపోయారు. వీరికి విశ్రాంతి కల్పించి, విండీస్ టూర్లో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించగా వారు విఫలమయ్యారు. ప్రపంచకప్ వన్డే కు ముందు ఈ సిరీస్ కీలకం కాగా, విండీస్ పై ఓటమితో ప్రపంచకప్ కు వెళ్తుండడం ఆందోళన కలిగిస్తున్నది.

    మొదట వరుసగా రెండు మ్యాచ్లో ఓడి.. ఆ తర్వాత రెండింటిలో గెలిచిన జట్టు.. ఆఖరి మ్యాచ్లో ఓడిపోయి సిరీస్ ను కోల్పోయింది. 2-3 తేడాతో సిరీస్ విండీస్ వశమైంది. ఈ టీ20 మ్యాచ్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆదివారం మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్(61, 45 బంతులో 4ఫోర్లు, 3 సిక్స్ లు) రాణించాడు. ఇక విండీస్ బ్యాట్స్ మెన్లలో బ్రెండన్ కింగ్ (85 నాటౌట్ 55 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్ లు) విరుచుకుపడ్డాడు. మరో బ్యాట్స్ మెన్ పూరన్ కూడా 35 బంతుల్లో 47 పరుగులు చేశాడు. దీంతో ఈజీగా విండీస్ విజయం సాధించింది.
    అయితే ప్రపంచకప్ కు ముందు భారత క్రికెట్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న యువ ఆటగాళ్లు ఇలా విఫలమవడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రయోగాలు చేయడం వద్దని అంటున్నా, రానున్న రోజుల్లో యువ ఆటగాళ్లే జట్టుకు కీలకం. దీంతో బీసీసీఐ ఇలాంటి మ్యాచ్ ల్లో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తుంటుంది. సన్నాహాక మ్యాచ్ లుగా ఈ సిరీస్ ఉపయోగపడుతుందనుకుంటే టీమిండియా సమష్టి వైఫల్యం ఈ సిరీస్ ద్వారా బయటపడింది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా విఫలమవుతున్నాడనే వాదనలు నిజమవుతున్నాయి. గత కొంతకాలం ఆయన కెప్టెన్సీపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

    అయితే మరోవైపు యువ ఆటగాళ్లు సూర్య కుమార్ యాదవ్, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్ అనుకన్నస్థాయిలో రాణించడం లేదు. ఒక్కొక్కరు ఒక్కో మ్యాచ్ లో పర్వాలేదనిపించినా, మిగతా మ్యాచుల్లో విఫలమవుతున్నారు. ఇక ఈ సిరీస్ లో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఒక్కడే పూర్తిస్థాయిలో పర్వాలేదనిపించాడు. ఏదేమైనా యువ ఆటగాళ్లతో బలమైన జట్టుగా ఉండాల్సిన టీమిండియా ఇలా వైఫల్యాలను కొని తెచ్చుకోవడం సరికాదనే అభిప్రాయం అభిమానుల నుంచి వినిపిస్తున్నది. ప్రతిభకు కొదవ లేని చోట వరుసగా విఫలమవుతున్న ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ పునరాలోచన చేయాలనే డిమాండ్ వినిపిస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    T20 World Cup Promo : ట్రెండింగ్ లో టీ20 వరల్డ్ కప్ ప్రోమో..

    T20 World Cup Promo : ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్...

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...

    T20 Indian Team : త్వరలోనే టీ 20 భారత జట్టు ప్రకటన 

    T20 Indian Team : టీ 20 ప్రపంచ కప్ అమెరికా,...

    MS Dhoni : దోనిని టీ 20 వరల్డ్ కప్ ఆడించొచ్చు.. కానీ ఒప్పించడమే కష్టం 

    MS Dhoni : మహేంద్ర సింగ్ దోని భారత క్రికెట్ దిగ్గజం....