
Kumara swamy : కర్ణాటక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ చివరి దశకు చేరుకుంటుండగా జేడీఎస్ నేత కుమారస్వామి నిరాశజనకమైన ప్రకటన చేశారు. డబ్బులు లేకపోవడంతో కనీసం పాతిక సీట్లను కూడా గెలవలేకపోతున్నామని అన్నారు. ఎన్నోసార్లు పోటీ చేయడం, రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఇలాంటి ప్రకటన చేయడం వెనుక ఆంతర్యం ఏంటని అంతా అనుకుంటున్నారు. అయితే దీనిక కారణం బీఆర్ఎస్ నేత కేసీఆర్ అంటూ వాదనలు వినిపిస్తున్నాయి.
మొదట్లో హవా.. రాను రాను దివాలా..
బీఆర్ఎస్ పార్టీ ప్రారంభ సమయంలో కేసీఆర్ ఇతర పార్టీల నేతలను దగ్గరకు తీసుకున్నారు. ఈ నేపథ్యలో కర్ణాటక ఎన్నికల్లో కలిసి పని చేద్దామని భరోసా కూడా ఇచ్చారు. తన ఫస్ట్ టార్గెట్ కర్ణాటకే అంటూ ప్రకటించాడు కూడా. కేసీఆర్ ను పూర్తిగా నమ్మిన కుమార స్వామి కర్ణాటక-తెలంగాణ సరిహద్దులో ఉన్న రాయచూర్, బీదర్, గుల్బర్గా, గంగావతి, కొప్పోల్ తో సహా తెలుగు ఎక్కువగా మాట్లాడే ఓటర్లు అధికంగా ఉన్న జిల్లాలు, నియోజకవర్గాల్లో జరిగే ప్రచారంలో భాగంగా కుమారస్వామితో కలిసి సీఎ కేసీఆర్ వేదిక పంచుకుంటారని దీంతో జేడీఎస్ కు ఓట్ల వస్తాయని ప్రచారం విస్తృతంగా చేశారు. అయితే కేసీఆర్ మాత్రం కర్ణాటక ఎన్నికల వైపు దృష్టి సారించలేదు సరికదా అలాంటి ఆలోచన కూడా చేయలేదు. ఇక బీఆర్ఎస్ నుంచి ఆర్థిక సాయం కూడా దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురై ఇలాంటి ప్రకటన చేశారని తెలుస్తోంది.
సీట్లతోనే లొల్లా..?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్ మొదట భావించింది. అయితే సీట్ల సర్దు బాటుపై కుమార స్వామి, కేసీఆర్ మధ్య సయోధ్య కుదరకపోవడంతో కర్ణాటకలో ఎన్నికల బరి నుంచి బీఆర్ఎస్ తప్పుకున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ సీట్లు కావాలని కేసీఆర్ అడుగగా పార్లమెంట్ సీట్లు ఇస్తానని కుమార స్వామి హామీ ఇచ్చారు అసెంబ్లీ సీట్ల కోసం కేసీఆర్ పట్టుబట్టడంతో కుమార స్వామి స్పందించలేదు. సీట్లు సర్దుబాటు కుదరకున్నా కేసీఆర్ లాంటి వ్యక్తిని తాను పెద్దన్నగా భావిస్తానని కుమార స్వామి చెప్పుకచ్చారు. వీటిని కేసీఆర్ మాత్రం పట్టించుకోలేదు. కనీసం ఆర్థికంగానైనా ఆదుకుంటారని కుమారి స్వామి అనుకున్నారట. అది కూడా లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కుమారస్వామి అని తెలుస్తోంది.
మౌనమేలనోయి..?
కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై సైలెంట్ అయ్యారు. ఇటీవల ఢిల్లీలో పార్టీ ఆఫీస్ తెరిచినా మీడియాకు అనుమతివ్వలేదు. దీంతో ఇది సైలెంట్ గా మిగిలిపోయింది. ఇప్పుడు ఏ రాష్ట్రం నాయకులకు కండువాలు కప్పడం లేదు. ఏపీ, ఒడిస్సా ఇన్ చార్జులను నియమించినా.. వారు ఎటువంటి కార్యకలాపాలు చేయడం లేదు. పక్క రాష్ట్రం కర్ణాటకను కూడా పట్టించుకోలేదు. దీంతో కేసీఆర్ రాజకీయాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.