Mahesh Babu Training : దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. దీనికి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీని కోసం మహేష్ బాబు మూడు నెలల పాటు కసరత్తులు చేస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికి తెలుసు. అందుకే ప్రస్తుతం మహేష్ బాబు ఆ పనిలో ఉన్నారు. తదుపరి సినిమా కోసం ఇప్పటి నుంచే కసరత్తు ఆరంభించాడు.
బాహుబళి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచ ఖ్యాతినార్జించిన రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబును ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియడం లేదు. ప్రేక్షకులు దీని కోసం ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకరు టాప్ హీరో మరొకరు టాప్ డైరెక్టర్. దీంతో ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో అని ఉత్కంఠగా ఉన్నారు. మొత్తానికి వీరి కాంబినేషన్ ఓ సాహసంగానే చూస్తున్నారు.
మహేష్ బాబు మూడు నెలల పాటు యాక్షన్ సన్నివేశాలపై వర్క్ షాప్ నిర్వహించి శిక్షణ తీసుకుంటున్నారట. దీంతో రాజమౌళి మొదట పది రోజులే అనుకున్న అవి కాస్త మూడు నెలలకు పెరిగాయట. దీంతో మహేష్ పాపం ఈ వయసులో తెగ కష్టపడుతున్నాడు. దీంతో సినిమాలో మంచి లుకింగ్ కోసమే మహేష్ బాబుకు కసరత్తులు చేయిస్తున్నారని సమాచారం.
ఆగస్టు 9న షూటింగ్ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. తరువాత రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో ఉంటుందని అంటున్నారు. మొత్తానికి మహేష్ బాబు, రాజమౌళి కలిసి తీయబోయే సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. సినిమా మూడు పార్టులుగా తెరకెక్కిస్తారట. దీనికి సంబంధించిన వివరాలు తెలియాలంటే ఆగస్టు 9 వరకు ఆగాల్సిందే అంటున్నారు.