Jr. NTR : నేటి తరం స్టార్ హీరోలలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే. ఆయన నటనని ఇష్టపడని వాళ్లంటూ ఎవ్వరూ ఉండరు. ఆయన చెయ్యలేని పాత్ర అంటూ ఏది లేదు. ఎలాంటి పాత్రని అయిన చాలా అలవోకగా చేసేస్తాడు. అందుకే ఎన్టీఆర్ ని నేటి తరం మహానటుడు అని అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు.
నిన్న మొన్నటి వరకు కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ఎన్టీఆర్, #RRR చిత్రం తో ప్రపంచం మొత్తానికి పరిచయం అయ్యాడు. తన అద్భుతమైన నటనతో కన్నీళ్లు రప్పించాడు. అయితే ప్రతీ హీరోకి ఎదో ఒక పాత్ర చెయ్యాలని ఒక డ్రీం ఉంటుంది. అలా జూనియర్ ఎన్టీఆర్ కి ఒక పాత్ర చెయ్యాలని చాలా కోరికగా ఉండేదట. ఆ పాత్రనే శ్రీ కృష్ణుడు. గతం లో ఒక హిందీ సినిమాలో శ్రీ కృష్ణుడి పాత్ర పోషించే అవకాశం వచ్చిందట, కానీ ఎన్టీఆర్ కి కాల్ షీట్స్ సమస్య రావడం తో ఆ పాత్రని వదులుకోవాల్సి వచ్చింది.
ఈ విషయాన్ని గతం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ తల్చుకుంటూ చాలా బాధపడ్డాడు అట. శ్రీ కృష్ణుడి పాత్ర పోషించకుంటే నటుడిగా నా కెరీర్ అసంపూర్ణమే, మా తాతయ్య గారు ఆ పాత్రలో కనిపిస్తే నా వళ్ళు పులకరించేది. ఆయన లాగ నేను చేయలేకపోయినా, నా వంతుగా ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. ఆయన మాటలు చూస్తూ ఉంటే రాజమౌళి తీసే మహాభారతం సిరీస్ లో ఎన్టీఆర్ తనకి కృష్ణుడి రోల్ కచ్చితంగా ఇవ్వాల్సిందే అని మారం చేసేట్టు అనిపిస్తుంది. కానీ ఎన్టీఆర్ ముఖం కృష్ణుడి కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది, డైలాగ్ డెలివరీ కూడా అద్భుతంగా ఉంటుంది, కానీ కృష్ణుడి కి ఉండాల్సిన విగ్రహం మాత్రం ఎన్టీఆర్ లో ఉండదు, అందుకే ఆయనకీ పాత్ర రాజమౌళి ఇవ్వడు అని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ చెప్తున్నారు.
ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో దేవర అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 5 వ తారీఖున విడుదల చేస్తామని మేకర్స్ ఇంతకు ముందు ప్రకటించారు. కానీ ఆ తేదికి విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయట. కారణం గ్రాఫిక్స్ వర్క్ చాలా వరకు పెండింగ్ ఉండడమే అని అంటున్నారు. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే ఈ సినిమాని డిసెంబర్ లో విడుదల చేసే యోచనలో ఉన్నారట మేకర్స్.