
Bichchagadu : బిచ్చగాడు సినిమా అంటే తెలియని ప్రేక్షకులు లేరు.. ఈ సినిమా ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంది.. చిన్న సినిమాగా వచ్చి భారీ వసూళ్లను రాబట్టింది సెన్సేషన్ క్రియేట్ చేసింది.. అప్పటి వరకు ఆ హీరో ఎవరో కూడా తెలియని తెలుగు ఆడియెన్స్ కు ఈ సినిమాతో పరిచయం అయ్యాడు.. కొత్త హీరో అయినప్పటికీ కంటెంట్ ఉండడంతో ప్రేక్షకులు బాగా ఆదరించారు..
విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ఈ సినిమా ఎటువంటి హంగామా లేకుండా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అయ్యింది.. అప్పట్లోనే ఈ సినిమా 25 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు బిచ్చగాడు 2 తెరకెక్కింది.. ఇక ఈ సీక్వెల్ లో విజయ్ ఆంటోనీ మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు..
నిన్న తెలుగు, తమిళ్ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేసారు.. ఇప్పుడు కూడా ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.. ఈ సినిమా ఈసారి కూడా పాజిటివ్ బజ్ తో మంచి కలెక్షన్స్ దిశగా సాగుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ వైరల్ అవుతుంది.. అంతగా ఆసక్తి కలిగించే టాపిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా..
ఇది వింటే మీరు ఆశ్చర్య పోతారు.. ఎక్కడి నుండి ఎక్కడికి లింక్ కుదిరింది అని.. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ రెండు సినిమాల్లో డబ్బును కీలకంగా చూపించారు.. అయితే బిచ్చగాడు 1 వచ్చినప్పుడు మన దేశ ప్రభుత్వం 500, 1000 నోట్లను రద్దు చేసింది.. మళ్ళీ దీనికి సీక్వెల్ గా బిచ్చగాడు 2 వచ్చినప్పుడు 2000 నోటును రద్దు చేసింది. దీంతో ఈ విషయం అందరికి ఆశ్చర్యంగా మారడంతో హాట్ టాపిక్ గా చర్చించు కుంటున్నారు.