41.5 C
India
Monday, May 6, 2024
More

    YCP Manifesto : వైసీపీ మ్యానిఫెస్టో ఇదేనా..? ‘నవరత్నాల’కు మించి..

    Date:

    YCP Manifesto
    YCP Manifesto

    YCP Manifesto : ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీలు, నేతల హడావిడి పెరిగిపోయింది. ఓ పక్క అభ్యర్థుల ప్రకటనలు, మరో పక్క మ్యానిఫెస్టోల తయారీపై పార్టీల హైకమాండ్ లు దృష్టి సారించాయి. అధికార వైసీపీ మ్యానిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరీ ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలు వైసీపీ మ్యానిఫెస్టో కోసం ఎదురుచూస్తున్నాయి.

    గత ఎన్నికల ముందు ‘నవరత్నాలు’పేరుతో సంక్షేమ పథకాలతో వచ్చి వైసీపీ ఘన విజయం సాధించింది. ఈ సారి మ్యానిఫెస్టోలో ఏ కొత్త పథకం తెస్తారోనని సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ మ్యానిఫెస్టోపై కొన్ని లీకులు వస్తున్నాయి. రైతు, డ్వాక్రా రుణమాఫీలు ఉంటాయని ఆ మధ్య బాగా ప్రచారం జరిగింది. అయితే ఇవేవి ఉండవని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం రైతులకు ఏడాదికి ఇస్తున్న రూ.13,500 భరోసా సొమ్మును పెంచే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈ సొమ్మును రూ.20 వేలు లేదా మరో వెయ్యి పెంచనున్నట్టు తెలిసింది. ఇందులో కేంద్రం వాటా యథావిధిగా ఉంటుంది.

    అయితే డ్వాక్రా రుణమాఫీని నాలుగు విడతల్లో చేసి జగన్ మహిళల ఆదరణ చూరగొన్నారు. ఈసారి మహిళలకు జగన్ ఎలాంటి హామీలు ఇస్తారనే చర్చ విపరీతంగా జరుగుతోంది. ప్రతీ పథకంలోనూ గతంలో కంటే అధిక లబ్ధి చేకూరేలా మ్యానిఫెస్టో ఉంటుందని చెబుతున్నారు. అమ్మఒడి లబ్ధిని రూ.15 వేల నుంచి రూ.20వేలకు పెంచే ఆలోచన ఉన్నట్టు సమాచారం. అలాగే పింఛన్ ను రూ.3వేల నుంచి రూ.4వేలకు విడతల వారీగా పెంచనున్నారు. ఈ ఐదేళ్లలో అమలు చేసిన పథకాలనే తిరిగి కొనసాగిస్తామని, వాటి లబ్ధిని పెంచుతామని జగన్ హామీ ఇవ్వనున్నట్లు వైసీపీ ముఖ్యులు చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    YS Sharmila : అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తెలియదు: వైఎస్ షర్మిల

    YS Sharmila : అవినాష్ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు...

    NDA Government : ఎన్డీయే ప్రభుత్వంతోనే ‘అనంత’ అభివృద్ధి

    కేంద్రమంత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు NDA Government :...

    WhatsApp Groups : ఏపీలో హల్ చల్ చేస్తున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల వాట్సప్ గ్రూపులు

    WhatsApp groups : ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ పనితీరుపై టీచర్లలో అసంతృప్తి...

    Allu Arjun Voice : వివాదంలో అల్లు అర్జున్ ’వాయిస్’..!

    Allu Arjun voice : ‘పుష్ప: ది రైజ్’ హిందీ వెర్షన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Sharmila : అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తెలియదు: వైఎస్ షర్మిల

    YS Sharmila : అవినాష్ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు...

    Postal Ballot : ఏపీ లో పరేషాన్ చేస్తున్న పోస్టల్ బ్యాలెట్

    Postal Ballot : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది....

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ...

    Jagan Viral Video : సార్..సార్..ఏంటి సార్ ఇది..ఎక్కడ పట్టుకొస్తారండి ఇలాంటి ఆర్టిస్టులని..

    Jagan Viral Video : ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేని...