33.8 C
India
Sunday, May 5, 2024
More

    పథకాలే జగన్ బలమా.. లబ్ధి చేకూరని వారి చూపెటు..?

    Date:

    2019 ఎన్నికల తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుతో ప్రజల దరికి చేరింది. గతంలో టీడీపీ ఇచ్చిన వాటి కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ గడపగడపనూ తట్టింది. అయితే ఇప్పుడు 2024 ఎన్నికలకు ఏపీ సిద్ధమవుతున్నది. ఈసారి తమను ఈ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని జగన్ భావిస్తున్నారు. అయితే ఈ సంక్షేమ పథకాలే ఏపీని దివాళా స్థితికి తెచ్చాయని ఓ వర్గం ప్రజల్లో ఉంది. మేధావులు కూడా ఇదే చెబుతున్నారు.

    ఏపీలో పది నెలల ముందుగానే ఎన్నికల వేడి పెరిగింది. ఒక్కో పార్టీ ఒక్కో అంశంతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. ప్రతిపక్ష టీడీపీ ఇప్పటికే మినీ మ్యానిఫెస్టో అంటూ వరాలు ప్రకటించింది. కర్ణాటకలో లాగే ఇక్కడ కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని టీడీపీ ముందుగానే చేసింది. మహాశక్తి  పేరిట మరో నాలుగు ప్రధాన హామీలు ఇచ్చింది. అయితే వైసీపీ పార్టీ మాత్రం తమను పథకాలే గెలిపిస్తాయని నమ్మకం పెట్టుకుంది. దుష్టచతుష్టయం కలిసి వచ్చినా ప్రజలంతా నావైపే నిలబడాలని జగన్ ప్రజలను పదే పదే ప్రాధేయపడుతున్నారు. ఒక్క చాన్స్ అంటూ వచ్చిన జగన్ ఎన్నో సంక్షేమ పథఖాలను అమల్లోకి తెచ్చారు. అయితే ఈ ఉచితాలే రాష్ర్టాన్ని దిశాళాకు తెచ్చాయని అంతా మండిపడుతున్నారు. మరో శ్రీలంక, వెనిజులాలా ఏపీ పరిస్థితి మారిందని చెబుతున్నారు.

    అయితే పథకాలు పొందిన వారు తనకు ఓటు వేస్తే చాలని,  అందని వారు తనకు వేయకున్నా పర్వాలేదని జగన్ చెబుతున్నారు. అంటే తనతో లబ్ధి పొందిన కుటుంబాలు తనతోనే నడుస్తాయని జగన్ భావిస్తున్నట్లుగా అంతా అనుకుంటన్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూనే తనను పథకాలే గెలిపిస్తాయని పదే పదే చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడు బీజేపీ తనకు రివర్స్ కావడంతో, జగన్ కూడా కొంత నిరాశకు గురైనట్లు కనిపిస్తున్ని. రాజకీయాల్లో సీనియర్ అయిన చంద్రబాబును ఢీకొట్టాలంటే ఎంతో చతురత అవసరం. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్, ఇక తనకు తిరుగులేదన్నంతగా విర్రవీగినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీల నాయకులపై ఆయన ప్రవర్తించిన తీరు హేయం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలే జగన్ కు గట్టిగా చెప్పినట్లయ్యింది. ఇప్పుడు ప్రతిపక్షాలంతా ఏకతాటి పైకి వచ్చాయి. అర్థ, అంగ బలాలు సమకూర్చుకున్నాయి. చంద్రబాబ లాంటి ఫక్తు రాజకీయ నేతను ఢీకొట్టాలంటే ఆయన కంటే ఎక్కువగా పని చేయడం తెలుసుకోవాలి. పని చేయించడం తెలుసుకోవాలి. అదేమీ లేకుండా కేవలం కార్యాలయానికే పరిమితం కావడం , బయటకు వెళ్తే భారీకేడ్లు కట్టించుకోవడం జగన్ కే దక్కింది. ప్రభుత్వ పథకాలు తీసుకున్న వారంతా ఓట్లు వేస్తారంటే, అది నమ్మకంగా చెప్పలేమని స్వయంగా ఆయన పార్టీల నాయకులే చెబుతున్నారు. ఈ సమయంలో జగన్ పరిస్థితిని మరింత విషమంగా చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నది. ఆయన చుట్టూ ఉన్న కోటరే ఇందుకు కారణమని అంతా భావిస్తున్నారు. ఇక ప్రజాక్షేత్రంలో జగన్ పరిస్థితి అనుకున్న బాగా ఏమీ లేదు. ఏపీ దివాళా తీయడానికి, రాష్ర్ట ప్రయోజనాలు కేంద్రం చెప్పు చేతల్లోకి పోవడానికి కారణం పక్కా జగనేనని ఏపీ జనం అనుకుంటున్నది. అంటే రానున్న రోజుల్లో జగన్ పరిస్థితి మరింత దారుణంగా మారబోతున్నదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో 19 మంది మృతి

    Telangana : తెలంగాణలో ఎండలకు తాళలేక వృద్ధులు, దినసరి కూలీలు మరణిస్తున్నారు....

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : జగన్ పర్యటనలో తప్పిన ప్రమాదం.. విచారణకు కు అదేశం..

    CM Jagan : ఈనెల 14న జగన్ అనంతపురం జిల్లా పర్యటన...

    Jagan Political Movies : జగన్ పొలిటికల్ సినిమా.. హిట్టా ఫట్టా?

    Jagan Political Movies : పాటిటిక్స్, సినిమా రెండింటినీ వేర్వేరుగా చూడడం బహూషా...

    AP CM YS Jagan : కాంగ్రెస్ లోకి జగన్ మనిషి.. వ్యూహంలో భాగమేనా?

    AP CM YS Jagan : ఖమ్మంలో కీలక నేత పొంగులేటి...