32.5 C
India
Thursday, May 2, 2024
More

    Bhashyam Praveen : కరుణామయుడిని ఆదర్శంగా తీసుకోవాలి..క్రైస్తవులకు ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు..: భాష్యం ప్రవీణ్

    Date:

    Bhashyam Praveen
    Bhashyam Praveen

    Bhashyam Praveen : క్రైస్తవ సోదర, సోదరిమణులకు ఈస్టర్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు ఉమ్మడి గుంటూరు జిల్ల పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్. ఆదివారం ఈస్టర్ పండుగ సందర్భంగా ఆయన తన శుభాకాంక్షలను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రజలందరూ కుల, మతాలకు అతీతంగా సంతోషంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. ఎవరికీ ఆపద వచ్చినా క్షణాల్లో వారి ముందుంటానని, ప్రజల సమస్యలే తన సమస్య అని వాటిని పరిష్కరించేందుకు నిత్యం వారికి అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చారు.

    క్రైస్తవ సోదర, సోదరిమణులు ఈస్టర్ పండుగను ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని ఆయన కోరారు. మరణాన్ని జయించి తిరిగి సజీవుడైన దేవుడు, యుగయుగాలకు యేసుక్రీస్తు సజీవుడై ఉంటాడన్నారు. క్రీస్తు సమాధి లోంచి లేచి వచ్చిన శుభవేళనే ఈస్టర్ పండుగగా జరుపుకుంటారు కాబట్టి ఇది అందరికీ శుభప్రదమేనన్నారు.  క్రీస్తు మానవాళి కోసం మరణించి తిరిగి లేచాడన్నారు.

    యేసుక్రీస్తు శాంతి, ప్రేమ, క్షమాపణ, కరుణ గుణాలను అనుసరిస్తూ వాటిని పాటిస్తూ సమాజంలో అందరూ క్రీస్తును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అన్ని కులాలు, మతాల ప్రజలు కలిసిమెలిసి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కులాలు, మతాలకతీతంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామన్నారు.

    కాగా, భాష్యం ప్రవీణ్ నియోజకవర్గంలో గెలుపు దిశగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికలకు ఇంకా 45 రోజుల సమయం ఉన్నప్పటికే ఇప్పటికే ఆయన నియోజకవర్గంలోని ప్రజల్లో ప్రవీణ్ పై ఓ రకమైన వేవ్ వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కులమతాలకు అతీతంగా పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలను బాగుచేయాలనే తపన ఉన్న ప్రవీణ్ కు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

    పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో భాష్యం ప్రవీణ్ ది అందెవేసిన చెయ్యి. తన సాయం కోరి ఎవరు వచ్చినా కాదనకుండా తనవంతుగా వారికి అండగా ఉండడం ఆయన స్పెషాలిటీ. ఇదే ఆయన్ను పేదల మనిషిగా, సేవా గుణం ఉన్న యువనేతగా నిలిపింది. ఇవన్నీ లక్షణాలే టీడీపీ కచ్చితంగా గెలిచే సీట్లలో పెదకూరపాడును చేర్చింది అనడంలో సందేహం లేదు. భాష్యం ప్రవీణ్ గెలిపించుకోవడం తమ బాధ్యతగా కుల,మతాలకతీతంగా ప్రజలు ముందుకు రావడం గమనార్హం.

    Share post:

    More like this
    Related

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...