37.3 C
India
Thursday, May 9, 2024
More

    Keeda Cola Movie Review : ‘కీడా కోలా’ రివ్యూ అండ్ రేటింగ్.. ఎలా ఉందంటే?

    Date:

    Keeda Cola Movie review
    Keeda Cola Movie review

    Keeda Cola Movie Review :

    నటీనటులు :

    బ్రహ్మానందం
    తరుణ్ భాస్కర్
    చైతన్య రావు
    విష్ణు
    జీవన్

    డైరెక్టర్ : తరుణ్ భాస్కర్

    పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో తరుణ్ భాస్కర్ తన టాలెంట్ నిరూపించుకున్నాడు.. సున్నితమైన కథలతో తనలోని రైటింగ్ అండ్ కామెడీ స్కిల్స్ ను చూపించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి ఆకట్టు కున్నాడు.. అలాగే ఈయన తనలోని నటుడిని కూడా చూపించాడు.. ఇక ఇప్పుడు తరుణ్ భాస్కర్ కీడా కోలా వంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియెన్స్ ను ఎలా మెప్పిస్తుందో చూద్దాం..

    కథ :

    కూడా కోలా అనే సినిమా కథ ముగ్గురు గ్యాంగ్స్ మధ్య నడిచే కథ.. వాస్తు (చైతన్య రావు), వరదరాసు (బ్రహ్మానందం), రాగ్ మయూర్ (లాయర్, లంచం) గ్యాంగ్స్.. ఈ మూడు గ్యాంగ్స్ డబ్బులు ఎలాగైనా సంపాదించాలనే కసితో ఉంటారు.. అలాంటి సమయంలో కీడా కోలా కొంటె వారికీ అందులో బొద్దింక వస్తుంది.

    ఈ క్రమంలోనే ఆ కంపెనీ మీద కేసు వేసి డబ్బులు కాజేయాలని చూస్తారు.. మరో వైపు జీవం కార్పొరేటర్ అయ్యి తనకు జరిగిన అవమానాలకు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంటాడు.. తన అన్న నాయుడు (తరుణ్ భాస్కర్) జైలు నుండి వస్తున్నాడని సంతోష పడతాడు. కానీ నాయుడు జైలు నుండి వచ్చాక సంత స్వరూపుడిగా మారుతాడు.

    గొడవలు వద్దని కీడా కోలా కంపెనీలో పని చేస్తూ జీవిస్తాడు.. అయితే కీడా కోలా కంపెనీలో డబ్బులు కోసం బొద్దింకను వేస్తాడు.. అసలు ఇతడు కోటీశ్వరుడు అవ్వాలని ఎందుకు అనుకుంటాడు? ఈయనకు వచ్చిన సమస్య ఏంటి? మూడు గ్యాంగ్స్ మధ్య ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథ..

    కామెడీ సినిమాలకు మన టాలీవుడ్ లో ఎప్పుడు ఆదరణ లభిస్తూనే ఉంటుంది.. కీడా కోలా స్క్రిప్ట్ ను తరుణ్ భాస్కర్ బాగానే రాసుకున్నాడు. స్క్రీన్ ప్లే కూడా అదిరిపోయింది.. తెరపై నవ్వులు పూయించాడు.. కానీ ఎక్కడో కొద్దిగా వెలితి కనిపిస్తుంటుంది.. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ ఎక్కువుగా నవ్వుతాం.. ఊహకు అందకుండా సాగే కథనం కూడా సినిమాకు మైనస్ గా నిలుస్తుంది. అలాగే ఈ సినిమా ఒకానొక సమయంలో ఎప్పటి కాలానిదో అనేలా ఉంటుంది.. స్టార్టింగ్ లో బోరింగ్ గా అనిపించినా మధ్యలో నుండి వేగం పెరిగి చిన్న ట్విస్ట్ తో సినిమా ముగుస్తుంది.

    ఇక నటీనటుల విషయానికి వస్తే.. ఇలాంటి బలహీనమైన కథ, కథనాలు ఉన్నప్పుడు నటీనటుల పర్ఫార్మెన్స్ మీదనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ అందరికి గుర్తుండి పోతాడు.. ఈయన నటన ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇక చైతన్య రావు, బ్రహ్మానందం ఆకట్టుకుంటారు. కానీ బ్రహ్మానందం ఆశించినంత మాత్రం ఆకట్టుకోలేడు.. లాయర్ క్యారెక్టర్, విష్ణు, జీవన్, రవీంద్ర ఇలా అన్ని పాత్రలు బాగానే మెప్పిస్తాయి.

    ఇక సాంకేతిక విషయానికి వస్తే.. సాంకేతికంగా ఈ సినిమా ఆడియెన్స్ ను ఆశ్చర్య పరుస్తుంది.. కెమెరా పనితనం, ఆర్ఆర్ నెక్స్ట్ లెవల్లో ఉంటాయి.. సాంగ్స్ కూడా సీన్స్ లో కలిసిపోయి బాగా అనిపిస్తాయి.. డబ్బు, స్వేచ్ఛ, జీవితం, నమ్మకం, ప్రేమ వంటి గురించి చెప్పే మాటలు కొన్నిసార్లు నవ్విస్తే మరికొన్ని సార్లు ఆలోచింపజేశాయి.. సినిమా నిడివి తక్కువుగా ఉండడం కూడా కలిసి వస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

    చివరిగా.. థియేటర్స్ లో కీడా కోలా అదిరిపోయింది.. ఆడియెన్స్ తో థియేటర్స్ గోల గోల గా కళకళ లాడిపోతుంది.

    Share post:

    More like this
    Related

    Expatriates : లక్షల కోట్లు పంపిస్తున్న ప్రవాసులు..ఈ విషయంలో ఇండియానే టాప్

    Expatriates : ప్రస్తుతం సంపాదన కోసం చాలామంది విదేశాల బాట పడుతున్నారు....

    Election Commission : ఈ సారి అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇవి తప్పనిసరి.. ఈసీ నిర్ణయంతో ఖంగుతింటున్న పార్టీలు..

    Election Commission : గత ఎన్నికల్లో కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో...

    YS Jagan : 15 నుంచి జగన్ లండన్ టూర్..! అందుకే అంటూ విమర్శలు..

    YS Jagan : ప్రభుత్వ కార్యక్రమాలు, ఎన్నికలు, ఎత్తులు పై ఎత్తులు,...

    Jagathi : నలభై ఏండ్ల వయసులో జగతి హాట్ ఫొటో షూట్స్

    Jagathi : జ్యోతి రాయ్ అనగానే చాలా మందికి తెలియక పోవచ్చు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related