33.8 C
India
Sunday, May 5, 2024
More

    Lakshmi Parvati : లక్ష్మీ పార్వతికి ఎన్టీఆర్ ఇమేజ్ మాత్రమే కావాలి.. ఆయన కోసం ఎప్పుడూ ఫైట్ చేయలేదు! తెలుగు రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయాలు

    Date:

    Lakshmi Parvati
    Lakshmi Parvati

    Lakshmi Parvati : తెలుగుతేజం, తెలుగుజాతికి స్ఫూర్తి ప్రధాత నందమూరి తారక రామారావు. ఈ పేరు వింటేనే ఏదో ఒక ఉత్సాహకరమైన పులకరింత మొదలవుతుంది. ఇటు నటనా రంగం, అటు పాలనా రంగం రెండింటిలో ఆయన చేసిన సాహనాలు, తీసుకున్న నిర్ణయాలు మరొకరు తీసుకోలేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. బతికి ఉన్నంత కాలం కృషి, పట్టుదలనే నమ్ముకున్న ఆయన చివరి రోజులు ఎంతో కొంత సఫర్ అయ్యాడని చెప్పక తప్పదు.

    ఇవన్నీ పక్కనుంచితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయన స్మారకంగా రూ. 100 నాణేన్ని రిలీజ్ చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని ఆవిష్కరించారు. అయితే నందమూరి కుటుంబానికి ఆహ్వానాలు పంపించింది కేంద్ర ప్రభుత్వం. అందులో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతికి మాత్రం ఇన్విటేషన్ పంపించలేదు. దీంతో ఆమె ‘తను ఎన్టీఆర్ భార్య అని ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించాడని తనను పిలవకుండా ఎలా ఆవిష్కరిస్తారని’ మీడియాలో రచ్చ రచ్చ చేసింది.

    ఎన్టీఆర్ భార్యగా చెప్పుకుంటున్న లక్ష్మీ పార్వతిపై కొందరు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్టీఆర్ భార్య అని చెప్పుకోవడమే కాదని ఆయన ఆశయాలు, ఆయన గుర్తులను చెదరకుండా చూసుకోవాలని చెప్తున్నారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ నుంచి ఎన్టీఆర్ పేరును తొలగించినప్పుడు లక్ష్మీపార్వతి మౌనంగా ఉన్నారని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీలో ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్ పర్సన్ గా ఉన్న లక్ష్మీపార్వతి ఈ మార్పును వ్యతిరేకించలేదు.

    ఎన్టీఆర్ వారసత్వం కోసం లక్ష్మీపార్వతి సెలెక్టివ్ గా వాదించడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పురోభివృద్ధి కోసం ఆమె తరచూ ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారే తప్ప ఆయన సిద్ధాంతాలను మాత్రం పట్టించుకోవడంలేదు. కేంద్రం నుంచి భారతరత్న అవార్డు కోరడం వంటి ఎన్టీఆర్ గుర్తింపు కోసం ఆమె తగిన చర్యలు తీసుకోకపోవడం, సమర్థించకపోవడం ప్రస్తుత అభ్యంతరాలపై ప్రశ్నలను లేవనెత్తుతోందని కొందరు వాదిస్తున్నారు.

    లక్ష్మీపార్వతి ఇటీవల చేసిన విమర్శలకు, ఆమె గత చర్యలకు, డిమాండ్లకు పొంతన లేదని, దీంతో ఆమె అసలు ఉద్దేశాలు, ప్రేరణలపై చర్చ జరుగుతోందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

    Share post:

    More like this
    Related

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో 19 మంది మృతి

    Telangana : తెలంగాణలో ఎండలకు తాళలేక వృద్ధులు, దినసరి కూలీలు మరణిస్తున్నారు....

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    TDP@42 : టిడిపి@42 శుభాకాంక్షలు చెప్పిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు..

    TDP@42 : తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ...

    Devara : దేవర నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్..? 

    Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీ...

    NTR : అనవసరంగా ఈ సినిమాలు చేశానని బాధపడ్డ ఎన్టీఆర్..

    NTR : జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు గురించి ఎవరికీ ప్రత్యేకంగా...