Mahesh babu : మామూలుగానే మహేశ్ బాబు సినిమా అంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి. ఆయన సినిమా నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా క్షణాల్లోనే వైరల్ అవుతుంది. అలాంటిది గుంటూరు కారం సినిమా విషయంలో మాత్రం మొదటి నుంచి ఫ్యాన్స్ కు డిసప్పాయింట్ మెంట్ ఉంది. ఆ మూవీ టీజర్ మినహా.. మిగతా విషయాలు ఫ్యాన్స్ ను కలవర పెడుతున్నాయి.
త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదాలు పడటం.. పైగా హీరోయిన్ పూజాహెగ్డే తప్పుకోవడం, ఇతర వర్కర్లు కూడా తప్పుకోవడం ఇలాంటివి జరిగాయి. దాంతో అసలు సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మాస్ ట్రీట్ తో సినిమాపై అంచనాలు పెంచేశాడు త్రివిక్రమ్.
సరిగ్గా అర్ధరాత్రి 12:06 నిమిషాలకు గుంటూరు కారం పోస్టర్‌ను యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో మహేశ్ లుక్ మామూలుగా లేదు. లుంగీ కట్టుకుని ఓ ఆఫీస్ టేబుల్ మీద కూర్చున్నాడు. పైగా చేతిలో సిగరెట్ కూడా ఉంది. ఇంకో చేతిలో గ్లాస్ పట్టుకుని.. స్టైలిష్ గా గ్లాసెస్ పెట్టుకుని ఊర నాటు లుక్స్ అంటే ఇవే అన్నట్టు అనిపించాడు.
ఇంకేముంది ఫ్యాన్స్ కు ట్రీట్ అదిరిందని అంటున్నారు ఆయన అభిమానులు. పైగా ఈ పోస్టర్ లో మూవీ రిలీజ్ డేట్ ను మరోసారి కన్ఫర్మ్ చేశారు. వచ్చే జనవరి 12న సంక్రాంతి కానుకగా రాబోతున్నట్టు చెప్పేశారు. షూటింగ్ వాయిదా పడుతుండటంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడుతుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదని త్రివిక్రమ్ టీమ్ క్లారిటీ ఇచ్చేసింది.
Wishing a spectacular Happy Birthday to the Reigning Superstar, @urstrulymahesh 🤩#HBDSuperstarMaheshBabu ✨
Your unparalleled on-screen brilliance coupled with your genuine off-screen humility continues to set a remarkable standard of inspiration 🌟🎉 #GunturKaaramOnJan12th… pic.twitter.com/lOzhJBZx1l
— Guntur kaaram (@GunturKaaram) August 8, 2023