Meenakshi Chaudhary : ‘గుంటూరు కారం’.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంతా అదే మేనియా నడుస్తోంది. సంక్రాంతి బరిలో దూకుతున్న మహేశ్, త్రివిక్రమ్ ల మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. వీరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా వంటి జనాలను బాగా అలరించాయి. ‘అతడు’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు టీవీల్లో వచ్చిన మంచి టీఆర్పీ రేటు వస్తుంది ఆ సినిమాకు. ఎన్నిసార్లు వచ్చినా ఆ సినిమా బోర్ కట్టదు. ఇప్పుడు అదే కాంబినేషన్ లో వచ్చే గుంటూరు కారం కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.
ఈసినిమాలో ప్రతీ చిన్న విషయం వైరల్ అవుతూనే ఉంది. మొన్నటిదాక ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ రచ్చ రచ్చ చేసింది. ఇక మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించిన మీనాక్షి చౌదరీ రెమ్యునరేషన్ పై తాజాగా చర్చ సాగుతోంది. ఈమె 2021లో ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత ‘హిట్: ది సెకండ్ కేస్’ మూవీలో అడవి శేష్ ప్రియురాలిగా నటించింది.
ఈ ముద్దుగుమ్మకు అందంతో పాటు అభినయం కూడా ఎక్కువే. అందుకే తొందర్లోనే మహేశ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చాన్స్ కొట్టేసింది. ఇక మొదటి హీరోయిన్ గా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్యూట్ బ్యూటీ శ్రీలీల. ఇంకా ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, రమ్యకృష్ణ, జయరాం తదితరులు నటిస్తున్నారు.
అయితే ఈ సినిమా తారల పారితోషికంపై చర్చ జరుగుతోంది. 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో నటించినందుకు మహేశ్ బాబు అత్యధికంగా 78-80 కోట్లు తీసుకున్నారట. శ్రీలీల 4 కోట్లు తీసుకుంది. ఇక సెకండ్ హీరోయిన్ గా నటించిన హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఏకంగా కోటి నుంచి రెండు కోట్ల దాక తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. కొత్త హీరోయిన్ కే రెండు కోట్లా అంటూ నోరెళ్ల బెట్టుతున్నారు. మొత్తానికి మీనాక్షి పంట పండింది బ్రో అంటున్నారు.