32.5 C
India
Sunday, April 28, 2024
More

    ‘800’ Movie Review : ‘800’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

    Date:

    '800' Movie Review
    ‘800’ Movie Review

    ‘800’ Movie Review :

    నటీనటులు :
    మధుర్ మిట్టల్
    మహిమా నంబియార్
    ఆడుక్కాలమ్ నరేన్ తదితరులు..
    డైరెక్టర్ అండ్ రచన : ఎంఎస్ శ్రీపతి
    నిర్మాత : వివేక్ రంగాచారి
    సినిమాటోగ్రఫీ : ఆర్డి రాజశేఖర్
    మ్యూజిక్ : జిబ్రాన్
    తేయాకు తోటల్లో పని చేసేందుకు వెళ్లిన తమిళ్ కుటుంబానికి చెందిన ముత్తయ్య ఫ్యామిలీ శ్రీలంకలో బిస్కట్ వ్యాపారంతో స్థిరపడుతోంది. శ్రీలంకలో తమిళ్, సింహళీయుల మధ్య జాత్యాంహంకార ఘర్షణలు ఉండడంతో వాటి నుండి తప్పించుకునేందుకు ముత్తయ్య కుమారుడు మురళీ ధరన్ ను క్రిస్టియన్ చర్చ్ స్కూల్ లో చేర్చుతాడు.. మరి మురళీధరన్ అక్కడ క్రికెట్ పై మక్కువ చూపిస్తాడు.
    ఈయన స్కూల్ లో జట్టులో ఆటగాడిగా చేరుతాడు.. అలాగే శ్రీలంక జట్టు సభ్యుడుగా మారడానికి ఎన్నో అవమానాలను అధిగమిస్తాడు. మరి ఈయన జట్టులో చేరిన తర్వాత ఎలాంటి సమస్యలను ఎదుర్కున్నాడు? శ్రీలంకలో తమిళులపై చూపించే వివక్ష వల్ల ఈయన ఎలాంటి ఘటనలను, అవమానాలను ఎదుర్కున్నాడు? అన్నిటిని తట్టుకుని ఎలా రాణించాడు? అనేది 800 సినిమా కథ..
    ఈ సినిమా మొత్తం చాలా ఎమోషనల్ గా సాగుతుంది.. శ్రీలంకలో తమిళ్ వాళ్లకు సింహళీయుల మధ్య ముందు నుండి ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఇదే వాతావరణంలో మురళీధరన్ ప్రయాణం కొనసాగుతుంది. శ్రీలంక జట్టులో ఏకైక తమిళుడిగా మురళీ ధరన్ చోటు సంపాదించుకున్న తీరు ఈ సినిమాలో ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుని యువతకు స్ఫూర్తిని ఇస్తుంది..
    అలాగే ఈయన జీవితంలో అత్యంత కీలకమైన భాగం ఆస్ట్రేలియా చకింగ్ ఆరోపణలు ఆ సమయంలో అర్జున్ రణతుంగ వ్యవహరించిన తీరు మొత్తం హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది.. అర్జున్ రణతుంగ క్యారెక్టర్ ఈ సినిమాలో మరో హీరో అనేలా అనిపిస్తుంది.. ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లు సాధించే జర్నీలో ప్రతీ అడుగు ప్రతీ అంశం ఒక ఛాలెంజ్ లా ఉంటుంది.
    వాటన్నిటిని ఎదుర్కొని ముత్తయ్య మురళీధరన్ రియల్ హీరో ఎలా అయ్యాడు అనేది ఈ సినిమాలో బాగా చూపించాడు. ఇక ముత్తయ్య మురళీధరన్ పాత్రలో మధుర్ మిట్టల్ సహజమైన నటనతో స్క్రీన్ మీద ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లో ఈయన ఆడియెన్స్ చేత కంటతడి పెట్టించాడు. ఇక ముత్తయ్య మురళీధరన్ భార్య మహిమ పాత్రలో నంబియార్ కూడా గుర్తుండిపోయేలా చేసింది. అర్జున రణతుంగ నటన అద్భుతంగా ఉంది అనే చెప్పాలి..
    ముత్తయ్య మురళీధరన్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసి ఈయన పేరు తెచ్చుకున్నాడు. కానీ ఈయన జీవితంలో మరో కోణం ఉంది.. అవన్నీ చాలా ఉద్వేగంగా ఆడియెన్స్ గుండెను పిండేసేలా డైరెక్టర్ కథను మలిచాడు. తెరమీద అద్భుతమైన సినిమాగా తీర్చి దిద్దారు.. ఇక జిబ్రాన్ సంగీత, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి.. నిర్మాణ విలువలు బాగున్నాయి.
    చివరిగా.. ముత్తయ్య మురళీధరన్ జీవితంలో ఎన్ని వివక్షలు, ఎన్ని అవమానాలు, మరెన్నో మలుపులు ఉన్నాయనే విషయం సినిమాతో ఆడియెన్స్ కు ఫ్యాన్స్ కు అర్ధం అవుతుంది.. లెజెండరీ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ను తెరపై బాగా తెరకెక్కించారు. ప్రతీ ఒక్కరు ఈ సినిమాను ఒక్కసారైనా చూడాల్సిందే..

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ‘800’ Trailer : అదరగొడుతున్న ‘800’ ట్రైలర్.. ఇందులో ఏముందంటే?

    '800' Trailer : ఇటీవల కాలంలో బయోపిక్ ల కాలం నడుస్తోంది....