Navdeep Drugs Case :
డ్రగ్స్ మహమ్మారి మన టాలీవుడ్ ఇండస్ట్రీని పట్టిపీడిస్తోంది. గతంలో ఎన్నోసార్లు డ్రగ్స్ కేసు ఇండస్ట్రీని కుదిపేసింది. అప్పట్లో చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఈ డ్రగ్స్ కేసులో చిక్కుకుని విచారణకు కూడా హాజరయ్యారు. అయితే ఇవన్నీ ఇంకా నిరూపితం అవ్వకపోయిన ఎప్పటికప్పుడు వారి ట్రెండింగ్ లోకి తెస్తున్నాయి.
మరి మన టాలీవుడ్ లో ఎప్పుడు డ్రగ్స్ పేరు వినిపించిన హీరో నవదీప్ పేరు మాత్రం తప్పకుండ వినిపిస్తుంది. ఈసారి మాదాపూర్ డ్రగ్స్ కేసులో కూడా మరోసారి నవదీప్ పేరు వినిపిస్తుంది. నవదీప్ గురించి తెలియని వారు లేరు.. ఈయన నటుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు.. మంచి మంచి సినిమాల్లో నటించిన నవదీప్ ఇప్పుడు స్పెషల్ రోల్స్ లో నటిస్తూ ఆకట్టు కుంటున్నాడు.
ఇక ఈయన పేరు ముందు నుండి డ్రగ్స్ కేసు చుట్టూనే తిరుగుతుంది. టాలీవుడ్ లో ఎప్పుడు డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చిన ఇతడి పేరు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.. ఈసారి కూడా మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఈయన పేరు వినిపిస్తుంది. ఈ కేసు నేపథ్యంలోనే నవదీప్ కు తాజాగా తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయ్యింది.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ తనకు బెయిల్ మంజూరు చేయాలనీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది.. నవదీప్ కు బెయిల్ ఇవ్వొద్దన్న నార్కోటిక్ పోలీసులతో కోర్టు ఏకీభవించింది. ఇక నవదీప్ కు 41A కింద నోటీసులు జారీ చేయాలని పోలీసులకు తెలిపింది. దీంతో నవదీప్ విచారణకు తప్పకుండ హాజరు కావాల్సి ఉంది..