30.2 C
India
Monday, May 6, 2024
More

    Part time Politics : పార్ట్ టైమా.. పవర్ కోసమేనా..? పవన్ పొలిటికల్ స్టాండ్ పై గందరగోళం

    Date:

    Part time politics
    Part time politics, Pawan

    Part time Politics : వారాహి యాత్రతో ప్రజాక్షేత్రంలో వెళ్లిన జనసేనఅధినేత పవన్ కల్యాణ్ ప్రసంగాలు అభిమానులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. అధికార పార్టీపై విమర్శల మాటెలా ఉన్నా తనను తాను నిరూపించుకోవాలనే ఆరాటం పవన్ లో కనిపించడం లేదు.  ప్రజారాజ్యం సమయంలో వాడిన డైలాగ్ లనే పదే పదే వాడుతున్నాడు. అప్పుడు కాంగ్రెసోళ్ల పంచలు ఊడదీసి కొడతాం అని అప్పడు కామెంట్లు చేశాడు. ఇప్పుడేమో వైసీపీ గుండాలను ఇళ్లల్లోంచి లాగి కొడతామంటున్నాడు. సినిమాల్లో చూపించే హీరోయిజం డైలాగులతో రాజకీయంగా పెద్దగా ఒరిగేది ఏముండదని పవన్ కల్యణ్ గ్రహించలేక పోతున్నాడు.  ఇలాగే తన ప్రసంగాలు కొనసాగితే ఓట్లు పడేది సందేహమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

    అది అభిమానుల స్టేట్ మెంట్..

    సీఎం’ అని మా వాళ్ల కోసం అంటున్నాను. కోట్ల మంది జీవితాలను ముందుకు తీసుకువెళ్లే పదవిని మోయాలంటే దానికి చాలా అనుభవం కావాలి. క్షేత్రస్థాయి పర్యటనలు, సమస్యలపై అవగాహన పెంచుకోవాలి. సీఎం సీఎం అని మావాళ్లు అదేపనిగా అరుస్తుంటే… నా కేడర్‌ స్టేట్‌మెంట్‌ను ఆమోదిస్తున్నాను.  సీఎం అని మావాళ్లు అనుకుంటే సరిపోదు. ప్రజలు కూడా అనుకోవాలి’ కదా అని పవన్ అంటున్నారు.

    ఇప్పడు సిద్దమట..
    2019లో కూడా రాజకీయంగా తనలో పరిణితి వచ్చిందని అనుకోలేదు. అప్పుడు నాపై నాకే సందేహం ఉండేది. ప్రస్తుతం నేను ఏపీకి సీఎం కావడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజలు ఆదరిస్తే కచ్చితంగా సీఎం అవుతానని అంటున్నాడు పవన్.  అందుకోసం ఎంత వరకైనా కొట్లాడుతా.. ఎవరి తోనైనా పోరాడుతానని అంటున్నాడు.

    అధికారం లేకున్నా భయపెట్టగలుగుతున్న..

    తనకు అధికారం లేకున్నా ప్రభుత్వాన్ని భయపెట్టగలిగినప్పుడు, ప్రజలు నన్ను కనీసం ఎమ్మెల్యేగానైనా గెలిపిస్తే ఎన్నో దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేస్తానని పవన్ తన ప్రసంగాల్లో తరచూ చెబుతున్నాడు. పార్టీ పెట్టిన పదేళ్లకు నేను మీ అందరినీ మొదటిసారి అడుగుతున్నాను.. నన్ను ముఖ్యమంత్రిని చేయడండి. అ పదవిలో కూర్చోవడానికి  సిద్ధంగా ఉన్నాంటూ చెప్పుకొస్తున్నాడు. అంటే ఇన్నాళ్లూ సీఎం అవ్వాలనే  కోరిక పవన్ కల్యాణ్ లో లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తన వ్యాఖ్యలను బట్టి చూస్తే పవన్ ఇంకా రాజకీయంగా పరిణితి చెందలేదేమోననే అనుమానాలను రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
    తన స్టాండ్ ఏమిటో ఇప్పటికీ ప్రజలకు, అభిమానులకు కన్వే చేయలేకపోతున్నాడు. ఒకసారి అభిమానుల కోసం అంటాడు.. మరోసారి ప్రజల కు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానంటాడు. ఇంకోసారి ప్రభుత్వాలు చేస్తున్న అవినీతిని వదిలించడానికి రాజకీయ యుద్ధ క్షేత్రంలోకి వచ్చానంటాడు. ఐదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న వపన్ మళ్లీ సినిమాల బాట పట్టాడు. పొలిటికల్ గా తన పార్టీని జనాల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలను చేపట్టడం లేదు.
    కాల్షీట్లు ఖాళీగా ఉంటే పవన్ రాజకీయాలంటూ ఇక్కడో వేషం వేస్తుంటాడని వైసీపీ నాయకులు పవన్ ను ఎద్దేవా చేస్తుంటారు. ఇప్పటికైనా పొలిటికల్ స్టాండ్ సరిగ్గా ఉంటే రాజకీయంగా ఎదుగుతాడే తప్ప పార్ట్ టైమ్ పాలిటిక్స్ తో చేసేది ఏముండదని, అనవసరంగా అతడిని నమ్ముకున్న అభిమానులు బలవుతారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

    Share post:

    More like this
    Related

    IPL 2024 : ఐపీఎల్ 2024: సీఎస్‌కే vs పీబీకేఎస్ మ్యాచ్ లో మతీషా పతిరానా ఆడలేదు.. కారణం ఇదే..!

    IPL 2024 : ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో...

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Varun Tej Campaign : రేపు పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం

    Varun Tej Campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం...

    Janasena Varahi Yatra : ఈనెల 27 నుంచి జనసేన వారాహి యాత్ర ప్రారంభం..

    Janasena Varahi Yatra : ఈనెల 27 నుంచి జనసేన అధ్యక్షుడు పవన్...

    Pawan Kalyan : సీఎం జగన్ పై నాకు ద్వేషం లేదు : పవన్ కళ్యాణ్

    Pawan Kalyan: వైసిపి అధినేత సీఎం జగన్ పై నాకు వ్యక్తిగ...

    AP BJP : పవన్ కళ్యాణ్ పై ఏపీ బీజేపీ ఇంకా గుర్రు.. ఎందుకో తెలుసా?

    AP BJP : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కార్యాచరణ సిద్ధం చేయనందుకు బీజేపీపై...