39.5 C
India
Thursday, May 2, 2024
More

    Pawan Kalyan : పవర్ స్టార్ వాడిన ‘గుడుంబా శంకర్’ ప్యాంటు ఆ స్టార్ హీరోకు బహుమతిగా ఇచ్చిన పవన్ కళ్యాణ్?

    Date:

    Pawan Kalyan :

    ‘ట్రెండ్ ఫాలో అవడం కాదమ్మా.. ట్రెండ్ సెట్ చేస్తా’ ఈ డైలాగ్ అన్నది ఎవరో గుర్తు పట్టారా? ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ రోజుల్లో ఆయన ఏది చేసినా ట్రెండ్ సెట్టరనే చెప్పాలి. ఆయన డ్రెస్.. అంతెందుకు ఆయన బాడీపై ఏ వస్త్రం ఉన్నా ఆయన ఫ్యాన్స్ కు అది గొప్పదనే చెప్పవచ్చు. అలా ఆయన వేసిన ‘గుడుంబా శంకర్’ ప్యాంట్ ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఇలాంటి బట్టలు కూడా వేసుకుంటారా? అని అందరూ ఆశ్చర్యపోయేవారు. అప్పట్లో యూత్ కూడా ఎక్కువగా అదే ఫాలో అయ్యేవారు.

    ఆ తర్వాత వచ్చిన బాలు ప్యాంట్ కూడా ఇంతే.. ఇది కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇలాంటి క్రేజీ ఆలోచనలు పవన్ కళ్యాణ్ కు ఎలా వస్తాయని అందరూ అనుకునేవారు. ఇక ఈ ఫ్యాంట్ల ధరలు తక్కువేమీ కాదట. రూ. లక్షలు పలుకుతాయట. అప్పట్లో ఈ కాస్ట్యూమ్ డిజైన్, స్టయిలింగ్ చేసింది వదిన రేణు దేశాయ్. కానీ ఐడియా మాత్రం అన్న పవన్ కళ్యాణ్ దే నట. ఈ ప్యాంట్ల గురించి ఒక ఆసక్తి విషయం సోషల్ మీడియా ద్వారా బయటపడింది.

    పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్’, ‘బాలు’ సినిమాల్లో వేసుకున్న ఆ ఫ్యాంట్స్ ను మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు గిఫ్ట్ గా ఇచ్చాడట. తన మొదటి సినిమా ‘రేయ్’లో ఈ ప్యాంట్స్ ను వాడినట్లు కనిపిస్తుంది. కానీ ఆ మూవీ భారీ డిజాస్టర్ అయ్యింది. దీంతో ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ వేసుకున్న ఫ్యాంట్లపై ఎవరి దృష్టి పడలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గుడుంబా శంకర్’ రీ రిలీజ్ సెప్టెంబర్ 2 ఆయన బర్త్ డే రోజున రీ రిలీజ్ అవ్వబోతోంది.

    ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ను కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించగా, రెస్పాన్స్ వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గత సినిమా రీ రిలీజ్ తో పోలిస్తే తక్కువే అని చెప్పాలి. మరి ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంత గ్రాస్ ని రాబడుతుందో చూడాలి మరి.

    Share post:

    More like this
    Related

    Population : ఆ దేశంలో రోజు రోజుకు తగ్గుతున్న జనాభా.. 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీ .. కారణం ఇదే!

    Population : రాను రాను జనాభా తగ్గుతుండడంతో జపాన్ తల పట్టుకుంటోంది....

    Bharatiyadu 2 : జూన్ లో ‘భారతీయుడు 2’..

    Bharatiyadu 2 :విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’...

    2thousand Crores : 4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు-పట్టుకున్న పోలీసులు

    2thousand Crores : అనంతపురం జిల్లా పామిడి వద్ద పెద్ద ఎత్తున...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Asaduddin Owaisi : జగన్ కు ఆ పార్టీ మద్దతు.. చంద్రబాబు.. పవన్ పై ఫైర్ అయిన పార్టీ అధినేత..

    Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ముఖ్యమైన పార్టీ...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...