39.4 C
India
Monday, April 29, 2024
More

    పెండ పిసికేటోడు తలసాని.. నా పవర్ తెల్వదు..

    Date:

    Revanth Reddy Fire
    Revanth Reddy Fire

    Revanth Reddy Fire : ఎన్నికలు సమీపిస్తుండడంతో నాయకులు నోటికి పదును పెడుతున్నారు. ఇప్పటి వరకూ దాదాపు కాంట్రావర్సీ మాటలు మాట్లాడని తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రియాంకా గాంధీ, రేవంత్ రెడ్డి, ప్రధాని నరేందర్ మోడీ, బండి సంజయ్ పై నోరు పారేసుకున్నారు. ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ సభకు హాజరైన నేపథ్యంలో ఆమెతో పాటు పొట్టోడు అంటూ రేవంత్ పై కూడా విరుచుకుపడ్డాడు. ‘పిసికితే చచ్చిపోతావ్ నా కొడకా’ అంటూ పరుషంగా ధూషించాడు. దీనిపై రేవంత్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు.

    తెలంగాణ ప్రభుత్వంలోని సోమేశ్ కుమార్ ను మళ్లీ తీసుకురావడంపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయనను కోర్టు వెళ్లిపోవాలన్నా.. కేసీఆర్ తన వెంట ఉంచకోవడంలో అర్థం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన అవినీతి, అక్రమాలు బయటపడకుండా సోమేశ్ ను తన వెంట ఉంచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మరో ఆరు నెల్లలో డిజాల్వ్ అయిపోతుంటే మూడేళ్లు సోమేశ్ కుమార్ ను నియమించడం ఏంటని ప్రశ్నించారు. మా ప్రభుత్వంలో కూడా ఆయననే కొనసాగించాలా అని ప్రశ్నించారు. తెలివితక్కువ నిర్ణయాలు తీసుకోవడంతో కేసీఆర్ ఘనత వహించారని సెటైర్ వేశారు. సలహాదారులకు కేబినెట్ హోదా ఇవ్వడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని, రాజ్యంగంపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఇది అంటూ విమర్శించారు. ఇష్టం వచ్చినట్లు జీవోలు తీయడం ఆయన హయాంలోనే చూస్తున్నామన్నారు. తెలంగాణలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని కేసీఆర్ రాజ్యాంగం అమలవుతుందని ఆయన మండిపడ్డారు.

    పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని సంవత్సరాలు ప్రభుత్వంలో ఉందని, పాలించడం పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అన్నారు రేవంత్. స్కాములు, దొంగ ఉద్యమాలు, ప్రజలను మభ్యపెట్టి  ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్ పాలన ఏపాటిదో కనిపిస్తూనే ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ర్టం ఇప్పుడు అప్పుల పాలు ఎలా అయ్యిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వారి కుటుంబం మాత్రం కోట్లాది రూపాయలు గడిస్తుంటే సామాన్య పౌరులు లక్షలాది అప్పుల్లో కూడుకుపోతున్నారన్నారు.

    కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకుండా కేసీఆర్ వ్యూహాలు పన్నారని రేవంత్ ఆరోపించారు. అక్కడ జేడీఎస్ కు మద్దతిచ్చి పరోక్షంగా బీజేపీ లాభపడేలా చేశారన్నారు. ఎవరెన్ని వ్యూహాలు రచించినా కన్నడిగులు కాంగ్రెస్ నే అక్కున చేర్చుకోబోతున్నారని, సర్వేలు కూడా అవే చెప్తున్నాయన్నారు. కన్నడ నాట మేమే.. రాబోవు తెలంగాణ లో కూడా మేమే ఉంటామని ధీమాగా చెప్పారు రేవంత్. ఇక తలసాని రేవంత్ పై చేసిన కామెంట్ పై ఆయన స్పందించారు. పెండ పిసికేటోనికి ఏం తెలుసు నా పవర్ రా.. తలసాని వస్తే తెలుస్తది ఎవరు ఎవరిని పిసుకుతారో అని..? మండిపడ్డారు.

    Share post:

    More like this
    Related

    Top Heroine : ఈ అమ్మడుని గుర్తుపట్టారా.. తెలుగు లో ఒకప్పటి టాప్ హిరోయిన్ నేటి జంతు సంరక్షురాలు

    Telugu Top Heroine : సినిమాల్లో టాప్ హిరోయిన్లుగా వెలుగొందిన ఒకప్పటి...

    Sakshi Dhoni : సాక్షి పెట్టిన పోస్టు వైరల్.. ఎందుకలా పెట్టిందంటే 

    Sakshi Dhoni : దోని బ్యాటింగ్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. దోని...

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతి: జేపీ నడ్డా

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని బీజేపీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతి: జేపీ నడ్డా

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని బీజేపీ...

    Gutha Amith Reddy : కాంగ్రెస్ పార్టీలో  చేరిన గుత్తా అమిత్ రెడ్డి

    Gutha Amith Reddy : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పార్లమెంట్ ఎన్నికల్లో...

    BRS-Congress : బీఆర్ఎస్ దారిలో కాంగ్రెస్

    BRS-Congress : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ...