Harish rao : తెలంగాణ రాజకీయాల్లో హరీశ్ రావుకు ఎంతో ఆదరణ ఉంది. అసలు సీఎం కేసీఆర్ స్థాయిలో అంత ప్రాధాన్యం ఉన్న వ్యక్తిగా ఎదిగారు. హరీశ్ రావు రాష్ర్టవ్యాప్తంగానే కాకుండా ఏపీలో నూ పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. రాజకీయాల్లో ఆయన శైలి నచ్చికొందరు.. ఆయన వ్యవహరించే తీరు నచ్చి మరికొందరు ఇలా అభిమానులుగా మారారు.
అయితే ఇటీవల తరచూ హరీశ్ రావు ఏపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తుండడం కొందరికి మింగుడు పడడం లేదు. ముఖ్యంగా వైసీపీ నాయకులకు, అక్కడి మంత్రులకు అసలే నచ్చడం లేదు. దీంతో హరీశ్ పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అయితే హరీశ్ రావు అభిమానుల నుంచి ఎదురుదాడి పెరగడంతో, ఇక చేసేదేమిలేక వెనక్కి తగ్గారు. ఏపీలో పరిస్థితి బాగాలేదని ఒకసారి, రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఏపీలో కంటే పంటలు తెలంగాణలో ఎక్కువగా పండాయని, చేపల అమ్మకాలు, భూముల రేట్లు ఇక్కడే ఎక్కువగా ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు.
నిజానికి ఏపీలో పరిస్థితి గత నాలుగేళ్లలో పూర్తిగా దెబ్బతింది. దీనిపైనే హరీశ్ రావు విమర్శలు చేస్తున్నారు. ఏపీ కంటే తెలంగాణలో నే అభివృద్ధి ఎక్కువ జరుగుతున్నదని చెప్పుకొస్తున్నారు. అయితే తెలంగాణ ఉద్యమం ముగిసి, స్వరాష్ర్టం సిద్ధించాక కూడా ఏపీ వారిపై విమర్శలు ఎందుకనే అభిప్రాయం మరికొందరిలో ఉంది. ఇంకా ఏపీ సెంటిమెంట్ తో ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అటు ఏపీలో కూడా తెలంగాణ మంత్రులు మనల్ని తిడుతున్నారని, వైసీపీ కూడా అక్కడ సెంటిమెంట్ రాజకీయం చేస్తున్నదనే అభిప్రాయం కూడా వినిపిస్తున్నది. రెండు పార్టీలు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలే చేస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా హరీశ్ రావు లాంటి కీలక నాయకులు ఏపీ మీద విమర్శలు చేయడం అక్కడి ప్రజలకు మాత్రం నచ్చడం లేదు. ఇప్పటికైనా మమ్మల్ని వదిలేయండి మహాప్రభో అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.