- కర్ణాటక విజయం తర్వాత దృష్టి అటే..

Ponguleti Srinivas Reddy : ఖమ్మం జిల్లాలో కీలక నేతగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి పేరుంది. ఆయన కు ఆ జిల్లాలో పెద్ద ఎత్తున అనుచరులు ఉన్నారు. బీఆర్ఎస్ ను వీడి ఆయన వేరే పార్టీలో చేరేందుకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు సొంత పార్టీ పెట్టేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారని భావించారు. ఇప్పటికే ఆయనతో రాష్ర్టంలోని కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా టచ్ లోకి వెళ్లారు. ఆయన మాత్రం ఈసారి ఖమ్మం జిల్లాలో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ర్టంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఖమ్మం నుంచి ఆపార్టీ నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ తాకనీయనని ఇప్పటికే ప్రకటించారు కూడా . అయితే ఆయన ప్రత్యామ్నాయ వేదిక వైపు చూస్తున్నారు. ఆయన ఏపీ సీఎం కు అత్యంత సన్నిహితుడు కూడా.
కర్ణాటక గెలుపుతో..
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో ఆ పార్టీకి దేశవ్యాప్తంగా కొంత సానుకూల పవనాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో కూడా ఆ పార్టీ ప్రస్తుతం నంబర్ 2 రాజకీయాలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో కర్ణాటక గెలుపు కూడా కలిసి వచ్చింది. దీంతో కాంగ్రెస్ వైపు పొంగులేటి చూస్తున్నారని తెలుస్తున్నది. అయితే ఇఫ్పటికే ఈటల రాజేందర్, బండి సంజయ్ బీజేపీలో చేరాలని ఇప్పటికే పొంగులేటిని కలిశారు. పొంగులేటి చేరితే ఆర్థికంగా కూడా ఆయన కలిసివస్తారని ఆయా పార్టీలు భావిస్తున్నట్లు సమాచారం. ఖమ్మంలో ఇప్పటికే ఆయన తన అనుచరులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఏ పార్టీలో చేరితే బాగుంటుందనే అంశంపై ఆయన ప్రధానంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం.
అయితే మరోవైపు ఆయన ఇప్పటికే ఓ కొత్త పార్టీ పేరును రిజిస్టర్ చేయించారని, త్వరలోనే ప్రకటిస్తారని తెలసింది. అయితే ఇదిలా ఉండగా పొంగులేటి మాత్రం ఇంకా మౌనం మాత్రం వీడడం లేదు. అనుచరులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు కొంత సముఖంగా ఉన్నట్లు ప్రస్తుతం నడుస్తున్న టాక్. మరి పొంగులేటి నిర్ణయం ఎలా ఉంటుందో మరికొన్ని రోజుల్లోనే తేలనుంది.