Mahesh babu సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగస్టు 09న పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే.. ఆయన పుట్టిన రోజు నాడు ఫ్యామిలీ నుండి సినీ ప్రముఖులు అందరు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెష్ చెప్పారు.. దీంతో సోషల్ మీడియా మొత్తం మహేష్ పేరు మారుమోగి పోయింది..
సూపర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసిన సందడి అంతా ఇంత కాదు.. విషెష్ తో మోత మోగించారు.. ఇక ఆయన తోటి హీరోలు కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు. ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం మహేష్ బాబుకు పుట్టినరోజు విషెష్ తెలుపుతూ స్పెషల్ పోస్ట్ చేసారు.
టాలీవుడ్ టాప్ హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్ ఇద్దరు కూడా టాప్ లోనే ఉన్నారు.. వీరు బయట తరచు కలిసిన సందర్భాలు తక్కువే అయినా ఇద్దరి మధ్య స్నేహబంధం అయితే ఉంది.. ఈ క్రమంలోనే పవన్ మహేష్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ పోస్ట్ చేసారు.. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది..
ఈయన పోస్ట్ చేస్తూ.. ”తెలుగు చలన చిత్రసీమలో తనదైన పంథా కలిగిన అగ్రశ్రేణి కథానాయకుడు మహేష్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మహేష్ బాబు కథానాయకుడిగా అందుకున్న ఘన విజయాలు తెలుగు సినీ పరిశ్రమ వృద్ధికి ఎంతో దోహదపడ్డాయి. తండ్రి నటశేఖర కృష్ణ గారి అడుగుజాడల్లో వెళ్తూ, విభిన్న పాత్రల్లో మెప్పించే అభినయ సామర్థ్యం ఆయన సొంతం. సోదరసమానుడైన శ్రీ మహేష్ బాబు మరిన్ని విజయాలు అందుకోవాలని, సంపూర్ణ ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ పవన్ పోస్ట్ ద్వారా తెలిపారు.. ఈ పోస్ట్ ఇరువురి ఫ్యాన్స్ లో ఆనందం నింపింది.