38.8 C
India
Sunday, April 28, 2024
More

    Prashant Neel : షారుఖ్ పై ప్రశాంత్ నీల్ పగబట్టాడా? వరుసగా రెండోసారి ఇలా..

    Date:

    Prashant Neel
    Prashant Neel

    Prashant Neel : సలార్ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టుకుంటూ దుమ్మురేపుతోంది. సలార్ వీరవిహారం.. నిన్న రిలీజైన షారుఖ్ ‘డంకీ’ పై పడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఐదేండ్ల క్రితం ఇదే టైంలో వచ్చిన షారుక్ మూవీని కేజీఎఫ్ తో ఢీకొట్టించి ఆయనకు తీవ్ర నష్టం తెప్పించాడు. ఇప్పుడు సలార్ దెబ్బకు ‘డంకీ’కి దమ్కీ ఇచ్చేలా కనపడుతోంది.

    దేశంలో ఎక్కడ చూసినా సలార్ మేనియానే కనిపిస్తోంది. బహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ పడక ప్రభాస్ కు, ఫ్యాన్స్ ఆకలితో ఉన్నారు. బహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యాం, ఆదిపురుష్ లు ఫ్యాన్స్ ను నిరాశపరిచాయనే చెప్పాలి. ఇప్పుడు సలార్ తో వారికి ఫుల్ మీల్స్ దొరికినట్టైంది. అందుకే ఫుల్ జోష్ లో ఉన్నారు. సలార్ కు ప్రభాస్ కటౌట్ తో పాటు, కేజీఎఫ్ చిత్రాల డైరెక్టర్ ప్రశాంత్ నీల్, అద్బుతమైన కాస్టింగ్ తో సినిమా బాగా హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు ఆడియన్స్ కూడా థియేటర్లకు చేరుకున్నారు. దీంతో సలార్ క్రేజ్ ఆకాశాన్నంటుతోంది. అభిమానుల అంచనాలకు మించి సలార్ ఉండడంతో పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది.

    సలార్ కు పోటీగా షారుఖ్ డంకీ నిన్న రిలీజ్ అయ్యింది. ఇది వాస్తవానికి నేడు రిలీజ్ కావాల్సి ఉంది. అయితే రెండు సినిమాలు ఒకే రోజు ఎందుకని నిన్న విడుదల చేశారు. ఫర్వాలేదు అనే టాక్ తో డంకీ థియేటర్లలో రన్ అవుతోంది. ఈ మూవీని షారుఖ్ ఇష్టపడి చేశారని ఆయన పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. డంకీ మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే  ఆ చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ నేపథ్యం మాములుది కాదు. ఆయన సినిమాల్లో సందేశం, ఎమోషన్స్, దేశభక్తి.. వీటికి కాస్త కామెడీ టచ్ ఉంటుంది. ఆయన చిత్రాలు అన్ని హిట్టే. ఓటమి ఎరుగని దర్శకుడు ఆయన. ఆయన తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీసిన అవి భారీ బడ్జెట్ ను రాబడుతాయి అనే టాక్ ఉంది. ఇక షారుఖ్.. ఈ ఏడాది జవాన్, పఠాన్  రెండూ రూ.1000కోట్ల క్లబ్ లో చేరడంతో డంకీపై మరిన్ని అంచనాలు పెరిగాయి. డంకీతో హ్యాట్రిక్ కొట్టాలని భావించారు.

    అయితే సలార్ కు వెరీ మాసివ్, బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో క్లాస్ మూవీ అయిన ‘డంకీ’కి ఎఫెక్ట్ అవకాశాలు కనపడుతున్నాయి. ఇద్దరూ పాన్ ఇండియన్ లెవల్ స్టార్సే కావడంతో రెండు మూవీలపై ఆసక్తి పెరిగింది. అయితే సలార్ సూపర్ టాక్ రావడంతో సౌత్ , నార్త్ అంటూ తేడా లేకుండా కాసుల వర్షం కురవనుంది.

    ఐదేండ్ల కింద ఇదే టైంలో షారుఖ్ ‘జీరో’ అనే మూవీతో వచ్చాడు. ఆ టైంలోనే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ పార్ట్-1 తీసుకొచ్చాడు. దీని దెబ్బకు పాపం షారుఖ్ మూవీకి భారీ నష్టం వాటిల్లింది. ఇప్పుడు సలార్ తో అదే రిపీట్ కాబోతుందా? మరోసారి ప్రశాంత్ నీల్ .. షారుఖ్ దెబ్బకొడుతున్నాడని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి షారుఖ్ ను పగపట్టినట్టుగా నీల్ సినిమాలు రిలీజ్ చేస్తున్నాడని అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Prabhas Friend : ఆ పాత్ర కోసం 31 కిలోలు తగ్గా: ప్రభాస్ ఫ్రెండ్ డెడికేషన్ ఇది..

    Prabhas Friend : ‘సలార్’లో వరద రాజమన్నార్ పాత్రలో నటించి...