39.6 C
India
Monday, April 29, 2024
More

    Rules Ranjan Movie Review : రూల్స్ రంజన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

    Date:

    Rules Ranjan Movie Review
    Rules Ranjan Movie Review

    యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం ఎస్.ఆర్ కల్యాణ మండపం తర్వాత అంతటి హిట్ అందుకోలేదు. వరుసగా సినిమాలు చేస్తున్నా సరే ఆశించిన హిట్ మాత్రం దక్కట్లేదు. కానీ ప్రయత్నాలు ఆపకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన హీరోగా నేహాశెట్టి హీరోయిన్ గా చేసిన మూవీ రూల్స్ రంజన్. ఈ సినిమాకు రతినం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ట్రైలర్ కూడా బాగానే ఆకట్టుకుంది. మరి నేడు థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

    కథేంటంటే..

    మనో రంజన్ (కిరణ్ అబ్బవరం) హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ గా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అతనికి సడెన్ గా ముంబైకి ట్రాన్స్ ఫర్ అవుతుంది. అక్కడే తన ఫ్రెండ్ అయిన బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ వెన్నల కిషోర్ రూమ్ లో ఉంటూ జాబ్ చేసుకుంటాడు. అక్కడే మనో రంజన్ కు చిన్ననాటి ఫ్రెండ్ సన(నేహా శెట్టి) కలుస్తుంది. అనుకోకుండా ఆమెతో ప్రేమలో పడుతాడు మనోడు. ఆమె కోసం రూల్స్ బ్రేక్ చేసి మరీ పబ్బులకు వెళ్తాడు. కానీ సడెన్ గా ఆమెకు ముందే పెళ్లి ఫిక్స్ అయిందని తెలుస్తుంది. దాంతో కథ అడ్డం తిరుగుతుంది. చివరకు మనో రంజన్ పరిస్థితి ఏమైంది, ఎలాంటి మలుపులు తిరిగింది, చివరకు ఎలా ఒక్కటయ్యారు అనేది మిగతా కథ.

    నటీనటుల పర్పార్మెన్స్..

    ఈ సినిమాలో మనో రంజన్ పాత్రలో కిరణ్‌ అబ్బవరం పర్వాలేదనిపించాడు. కానీ కొన్ని సీన్లలో అతని నటన పాత్రకు సరిపోయినట్టు అనిపించలేదు. కామెడీ సీన్లలో తప్ప ఎమోషనల్ సీన్లలో ఆకట్టుకోలేకపోయాడు కిరణ్‌ అబ్బవరం. అతని ప్రేయసి సన పాత్రలో నేహాశెట్టి కూడా పర్వాలేదు అన్నట్టే నటించింది. ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ ఉండదు. ఇక సినిమాకు హైలెట్ గా నిలిచింది మాత్రం వెన్నెల కిషోర్ పాత్ర. అతని పాత్ర ఆకరణంగానే సినిమాలో కామెడీ పుట్టింది. అది సినిమాకు ఎంతో కొంత ప్లస్ అయింది. మిగతా పాత్ర దారులు తమ పాత్రల మేరకు ఆకట్టుకున్నారు.

    టెక్నికల్ పర్ఫార్మెన్స్..

    దర్శకుడు రతినం కృష్ణ ఈ కథను చాలా రొటీన్ గా రాసుకున్నాడు. ఇలాంటి కథలు గతంలో చాలానే వచ్చాయి. కానీ కథలో సీన్లు, డైలాగులు కొత్తగా ఉండేలా చూసుకోవాలి. రూల్స్ రంజన్ లో అలాంటిదేమీ లేదు. ఫస్ట్ హాప్ చాలా స్లోగా సాగిపోతుంది. వెన్నెల కిషోర్ పాత్ర సినిమాకు ప్లస్ అయింది. ఇక సెకండ్ హాప్ మాత్రం చాలా బోరింగ్ గా సాగుతుంది. అక్కడక్కడా అనవసరంగా ఎమోషనల్ సీన్లను ఇరికించారు. వాస్తవానికి ఈ సినిమా మొత్తాన్ని కామెడీ బేస్ గా చేసుకుని తీసి ఉంటే పెద్ద హిట్ అయ్యేది. కానీ సెకండ్ హాఫ్ తేడా కొట్టేసింది. సెకండ్ హాఫ్ లో హైపర్ ఆది, వైవా హర్ష, వెన్నెల కిషోర్ ల వల్లనే సినిమా కాస్త ఆకట్టుకుటుంది. కథలో పెద్దగా బలం లేదు. అమ్రిష్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేదు. బీజీఎం పర్వాలేదు. దులీప్ కుమార్ ఎం.ఎస్ ఎడిటింగ్ చాలా దెబ్బ కొట్టేసింది. సినిమాలో ల్యాగ్ చాలా ఎక్కువగా ఉంది.

    ప్లస్ పాయింట్లు..

    కామెడీ
    అక్కడక్కడా ఆకట్టుకునే సీన్లు

    మైనస్ పాయింట్లు..

    కథలో బలం లేకపోవడం
    ల్యాగ్ ఉన్న సీన్లు
    కొన్ని అనవసరంగా వచ్చే ఎమోషనల్ సీన్లు..

    తీర్పు..

    కిరణ్ అబ్బవరం మరోసారి రొటీన్ కథతోనే వచ్చాడు. రూల్స్ రంజన్ లో కామెడీ పర్వాలేదనిపిస్తుంది. అంతే తప్ప ఇంకేం లేదు. మొత్తానికి రూల్స్ రంజన్ రూల్స్ పాటించలేదు.

    సినిమా రేటింగ్: 3/5

    Share post:

    More like this
    Related

    Road Accident : లారీ, ఆటో ఢీకొని నలుగురి మృతి

    Road Accident : కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి...

    CM Jagan : చంద్రబాబుని నమ్మితే గోవిందా.. గోవిందా..: సీఎం జగన్

    CM Jagan : చంద్రబాబును నమ్మితే గోవిందా.. గోవిందా అని సీఎం...

    Guntakal Junction : రైల్వే స్టేషన్ లో తనిఖీలు.. మహిళ బ్యాగ్ లో రూ.50 లక్షలు

    Guntakal Junction : ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు....

    Dhruv Rathee : సోషల్ మీడియా సంచలనం ధ్రువ్ రాఠీ..ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న ఇన్ ఫ్లూయెన్సర్

    Dhruv Rathee : ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల చాలా మంది...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related