34 C
India
Friday, April 26, 2024
More

    Sarath Babu property : శరత్ బాబుకు పిల్లలు లేరు.. మరి ఆయన కోట్ల ఆస్తికి వారసులు ఎవరు?

    Date:

    Sarath Babu property
    Sarath Babu property
    Sarath Babu property : వెటరన్ యాక్టర్ శరత్ బాబు అంటే మన టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియా భాషల్లో అందరికి పరిచయమే.. ఈయన సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 5 దశాబ్దాలు అవుతుంది.. అయిన కూడా ఈయన నిన్న మొన్నటి వరకు సినిమాలు చేస్తూనే ఉన్నాడు.. కానీ గత రెండు మాసాలుగా శరత్ బాబుకు ఆరోగ్యం బాగుండక పోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
    అయినా కూడా ఈయనను డాక్టర్స్ కాపాడలేక పోయారు.. సుదీర్ఘ పోరాటం తర్వాత ఈయన మే 22 న మరణించారు.. 1973లోనే నటన మీద ఉన్న మక్కువతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన ఇప్పటి వరకు ఏదొక రూపంలో సినిమాలు చేస్తూనే ఉన్నాడు.. 300 పైగానే సినిమాల్లో నటించిన ఈయనకు కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్నో అందుకున్నాడు.
    ఇదిలా ఉండగా శరత్ బాబు మరణించడంతో ఈయన ఆస్తుల గురించి ఇప్పుడు సీరియస్ చర్చ నడుస్తుంది.. అందుకు కారణం శరత్ బాబుకు సంతానం లేదు.. ఈ క్రమంలోనే ఈయన మృతి తర్వాత ఆయన ఆస్తులు ఎవరికీ చెందుతాయి.. వీటికి వారసులు ఎవరు అనే దానిపై సీరియస్ గా చర్చ జరుగుతుంది.. అయితే శరత్ బాబు చిన్న చెల్లెలు సరితని ఈ విషయంలో ఇంటర్వ్యూ చేయగా ఆమె చాలా విషయాలు పంచుకున్నారు.
    అన్నయ్యే తనకు అమ్మానాన్న అని తన పెళ్లి కూడా ఆయనే చేసారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఆమె పిల్లలను కూడా చదివించారని కూతురు పెళ్లి కూడా చేసారని చెప్పుకొచ్చింది.. శరత్ బాబుకు పిల్లలు లేకపోవడంతో దత్తత తీసుకోవాలని అనుకున్నారని కానీ ఆ ప్రయత్నం ఆగిపోయింది అని చెప్పుకొచ్చారు. తన కూతురు సోనియాను కూడా చాలాసార్లు దత్తత ఇవ్వమని అడిగారని తాను నవ్వి ఊరుకునే దాన్ని అని తెలిపింది. మరి ఈయన ఆస్తికి వారసులు ఎవరు అంటే తనకు తెలియదు అన్నారు..

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : అధికారం వద్దు… సినిమానే ముద్దంటున్న పవన్ కళ్యాణ్

    Pawan Kalyan : భారతీయ జనతా పార్టీ,తెలుగు దేశం పార్టీ, జనసేన...

    Weather Report : 28 నుంచి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు

    Weather Report : తెలంగాణలో ఈ నెల 28 నుంచి వర్షాలు...

    Canada : కెనడాలో ఉద్యోగాల్లేవ్ రాకండి..సీనియర్ సిటిజన్ వేడుకోలు.. వీడియో వైరల్

    Canada : భారత్ లో గ్రాడ్యుయేట్ అయిన ప్రతీ ఒక్కరి కల...

    IPL 2024 Today : కోల్ కతా నైట్ రైడర్స్.. పంజాబ్ మధ్య కీలక పోరు

    IPL 2024 Today : ఐపీఎల్ లో ఈ సీజన్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ramaprabha : శరత్ బాబును కడసారి చూసి కన్నీళ్లు పెట్టుకున్న రమాప్రభ.. ఇంకా ప్రేమ చావలేదంటూ.. 

    Ramaprabha : వెటరన్ నటుడు శరత్ బాబు నిన్న అనారోగ్యంతో కన్నుమూశారు.....

    Sarath Babu Born : శరత్ బాబు ఎప్పుడు, ఎక్కడ జన్మించారో మీకు తెలుసా?

    Sarath Babu born : వెటరన్ యాక్టర్ శరత్ బాబు అంటే...

    Sarath Babu Death : నటుడు శరత్ బాబు మృతి.. ఇండస్ట్రీలో విషాదం!

      Sarath Babu Death : టాలీవుడ్ లో ఈ మధ్య వరుసగా విషాద...