34.6 C
India
Sunday, April 28, 2024
More

    “Chinna” Movie Review & Rating : ”చిన్నా” మూవీ రివ్యూ అండ్ రేటింగ్!

    Date:

    "Chinna" movie review and rating
    “Chinna” movie review and rating

    “Chinna” Movie Review & Rating :

    హీరో సిద్ధార్థ్ గురించి సౌత్ ఇండస్ట్రీకి బాగానే సుపరిచితం.. ఈయన ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ అందుకుని తెలుగులో లవర్ బాయ్ ఇమేజ్ ను అందుకున్నాడు.. వరుస సూపర్ హిట్స్ తో దూసుకు పోతూ స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే సిద్ధార్థ్ అనూహ్యంగా వరుస ప్లాప్స్ తో కెరీర్ లో ఒక్కసారిగా డల్ అయ్యాడు.. ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయి అక్కడే సినిమాలు చేస్తున్నాడు.

    మళ్ళీ తెలుగులో కూడా రీ ఎంట్రీ ఇచ్చాడు.. ఇక్కడ అక్కడ అనే సంబంధం లేకుండా ఎక్కడ కథ నచ్చితే అక్కడ సినిమాలు చేస్తున్నాడు. మరి తాజాగా సిద్ధార్థ్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ”చిన్నా” అనే సినిమాతో ఈయన ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ సినిమాను అరుణ్ కుమార్ డైరెక్ట్ చేసాడు.

    నిమిషా సజయన్, సహస్ర శ్రీ ముఖ్యపాత్రల్లో నటించగా తమిళ్ లో చిత్తా అనే పేరుతో ఇప్పటికే రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. ఇక తెలుగులో చిన్నా అనే పేరుతో ఈ రోజు రిలీజ్ అయ్యింది. మరి చిన్నా సినిమాను సిద్ధార్థ్ నే స్వయంగా నిర్మించగా ఈ సినిమా ఎలా ఉంది ? రివ్యూ ఒకసారి చూద్దాం..

    కథ ఏంటంటే.. అన్నయ్య చనిపోవడంతో వదిన, పాపను జాగ్రత్తగా చూసుకుంటూ ఒక చిన్న జాబ్ చేసుకుంటూ జీవితాన్ని గడుపు తుంటాడు ఈశ్వర్ (సిద్ధార్థ్).. అదే సమయంలో చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్ళి రేప్ చేయడం, చంపేయడం వంటి సంఘటనలు అక్కడ జరుగుతుండగా ఈశ్వర్ ఇంటి దగ్గరలో ఉండే మరో పాపతో మాములుగా మాట్లాడిన ఈశ్వర్ కూడా అలాంటి వాడే అని అంతా కొట్టి పోలీసులకు అప్పజెబుతారు. ఇక ఆ తర్వాత ఈశ్వర్ అన్న కూతురు కూడా కనిపించకుండా పోవడంతో ఆమెను ఈశ్వర్ తన స్నేహితులు, పోలీసుల సహాయంతో ఎలా పట్టుకున్నారు అనేది కథ..

    ఈ సినిమా ఎమోషనల్ కంటెంట్ తో పాటు ఒక మంచి స్క్రీన్ ప్లేతో సినిమా మొత్తాన్ని బాగా నడిపించాడు డైరెక్టర్.. చిన్న పిల్లలపై సమాజంలో జరిగే అఘాయిత్యాలను బేస్ చేసుకుని డైరెక్టర్ కథ నడిపించిన తీరు అందరికి కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాలో అలాంటి పరిస్థితులను ఎదుర్కున్న పిల్లల భవిష్యత్తు ఏంటి అని పాజిటివ్ పాయింట్ తో ముగిస్తాడు.

    సిద్ధార్థ్ తన పాత్ర మేర బాగా చేసాడు. చిన్న పాప కూడా అద్భుతంగా నటించి ఆకట్టుకుంది.. ఇలాంటి సినిమాలు కమర్షియల్ గా ఎంత సక్సెస్ అవుతుందో తెలియదు కానీ ఈ సినిమాకు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంటుంది.. ఈ సినిమాను ప్రతీ ఒక్కరు ఖచ్చితంగా చూడాలి..

    రేటింగ్ : 3/5

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related