39.3 C
India
Friday, April 26, 2024
More

    సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం : ఏపీ సీఎం జగన్

    Date:

    Ap cm jagan
    Ap cm jagan

    ఏపీ అభివృద్ధిలో భాగంగా భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ బుధవారం శంకుస్థాపన చేశారు. మూడేళ్ల లోపు ఈ ఎయిర్ పోర్టు పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు ఏపీ అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారుతుందన్న జగన్..ఇవాళ శంకుస్థాపనను జీర్ణించుకోలేని వారు ఉన్నారన్నారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలసలు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ఉత్తరాంధ్ర జాబ్ హబ్ గా మారబోతుందని అన్నారు. మెడికల్ టూరిజం, ఐటీ ఇండస్ట్రీ ఏపీకి కేంద్ర బిందువుగా మారాయి. 2026లో మీ బిడ్డ భోగాపురం ఎయిర్ పోర్టును ప్రారంభిస్తాడని జగన్ అన్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరెన్ని కుట్రలు చేసినా పని చేయవని సీఎం అన్నారు.

    ఈ శంకుస్తాపనని కొందరు జీర్ణించుకులేకపోతున్నారని..అలాగే సుప్రీంకోర్టులో, ఎన్జీటీలో కేసులు వేసి ఇబ్బందులు పెడుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు వచ్చి కొబ్బరికాయలు కొట్టి బిల్డప్ ఇచ్చారు. ఆ తర్వాత తామే శంకుస్థాపన చేశామని గొప్పలు చెప్పుకుంటారు. 30 నెలల్లోనే ఈ పనులను పూర్తి చేస్తామని జీఎంఆర్ మాటిచ్చారు. రైతన్నల వల్లే ఈ ప్రాజెక్టు వచ్చిందని సీఎం అన్నారు. ఉత్తరాంధ్ర అంటే బ్రిటీషర్లను గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు పుట్టిన గడ్డ. అందుకే కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాకు అల్లూరి పేరు పెట్టుకున్నాం. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్లు పూర్తి చేశామని జగన్ అన్నారు. కిడ్నీ సమస్యలు రాకుండా ఇచ్ఛాపురం, పలాస ప్రజలకు సురక్షిత తాగునీరు ఇస్తామని..ఈ జూన్ లోగా తాగునీటి పథకాన్ని జాతికి అంకితం చేస్తామని జగన్ కీలక ప్రకటన చేశారు. పాలూరులో డ్రైవర్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తామని జగన్ అన్నారు.

    గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా చూడండి. ఈ సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం అని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మన ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందని భావిస్తేనే తనను ఆశీర్వదించండని అడుగుతామని అన్నారు. మేనిఫెస్టో అంటే టీడీపీ మాదిరిగా 600 పేజీల పుస్తకం నింపి..ఎన్నికల తర్వాత చెత్తబుట్టలోకి వెళ్ళేది కాదన్నారు. అధికారం కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన వాళ్ల దగ్గరకు వెళ్లి కూడా మీకు మా ప్రభుత్వం ద్వారా మంచి జరిగిందా అని అడగగలం. మంచి జరిగిందని భావిస్తేనే మళ్లీ ఆశీర్వదించండి. మంచి చేశాం కాబట్టి మీ ముందుకు వచ్చి ఇలా అడగగలం. అలాగే చంద్రబాబు ఇలా అడగగలడా? అని జగన్ ప్రశ్నించారు. చేసింది చెప్పడానికి చంద్రబాబు దగ్గర ఏమి లేదు. ఏ మంచి చేయని చంద్రబాబుకు దత్తపుత్రుడు ఎందుకు సహకరిస్తున్నాడు? చంద్రబాబు ముఠా దొంచుకో, పంచుకో, తినుకో అనే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. కానీ తాము ప్రజలను నమ్ముకున్నామని జగన్ పేర్కొన్నారు.

    Share post:

    More like this
    Related

    One project : ఒక్క ప్రాజెక్టుకు తట్టెడు మట్టి తీశారా?

    One project : ‘‘ఆంధ్రప్రదేశ్ లో సాగునీటి ప్రాజెక్టులు కట్టిస్తాం.. ప్రతి...

    Former CMs : జగన్ ను ఓడించడానికి ఒక్కటైన మాజీ సీఎంలు

    Former CMs : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయాల్లో...

    Bathing Tips : నగ్నంగా స్నానం చేస్తున్నారా! ఆ తప్పు మళ్లీ చేయద్దు..

    Bathing Tips : ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : సిఎం జగన్ పై దాడి కేసులో అప్ డేట్

    - నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు CM Jagan : సిఎం జగన్...

    Police Statement : జగన్ పై దాడి కేసు.. పోలీసుల ప్రకటన

    Police Statement : సిఎం జగన్ పై రాయితో దాడి చేసిన...

    CM Jagan : సీఎం జగన్ వస్తున్నారంటే.. చెట్లపై వేటు

    CM Jagan Tour : సీఎం జగన్ పర్యటిస్తున్నారంటే చాలు.. ఆయన...

    Revanth-Jagan : జగన్ బాటలో రేవంత్.. త్వరలో వాటికి శ్రీకారం!

    Revanth-Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకువచ్చిన వలంటీర్ వ్యవస్థపై...