Hero Suhas : హీరో సుహాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని పాత్రల్లో చక్కగా ఒదిగిపోతాడు. కలర్ ఫొటోలో లవర్ గా ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చాడో ఫ్యామిలీ డ్రామాలో అంతే స్థాయిలో షాడిస్ట్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చిన్న సినిమాతో పెద్ద హిట్ ఇవ్వడంలో సుహాన్ పండిపోయాడని చెప్పవచ్చు. ఇటీవల వచ్చిన ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ మంచి సక్సెస్ నే ఇచ్చింది.
ప్రేక్షకుల దృష్టి సినిమాపై పడాలంటే ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ కావాల్సిందే. ముఖ్యంగా స్మాల్, మీడియం రేంజ్ సినిమాలు కంటెంట్ పైనే ప్రధానంగా ఆధారపడతాయి. అలాంటి చిన్న సినిమాలు చేయడం సుహాన్ కు కొట్టినపిండి. ఇప్పుడు ఓ వెరైటీ కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్నాడు. అర్జున్ వైకే దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ప్రసన్న వదనం’ లో సుహాన్ నటించాడు. దీనికి సంబంధించి టీజర్ తాజాగా వదిలారు. ‘ఫేస్ బ్లైండ్ నెస్’ అనే కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుంది. ‘ఫేస్ బ్లైండ్ నెస్’తో బాధపడుతున్న వారు ఫేస్ లో అన్ని కనిపిస్తున్నా.. ముఖాన్ని మాత్రం గుర్తు పట్టలేరు. ఈ మూవీలో హీరో సుహాన్ కు ఉన్న అనారోగ్య సమస్యే ఇదే.
తన అమ్మా, నాన్న ఫొటోను గుర్తు పట్టని సీన్ తో మొదలైన ఈ టీజర్ ఆసక్తిగానే సాగింది. ఈ కాన్సెప్ట్ కు క్రైమ్ ఎలిమెంట్ కూడా యాడ్ చేసినట్లు తెలుస్తుంది. ‘ఫేస్ బ్లైండ్ నెస్’ ను స్క్రీన్ ప్లేలో బ్లెండ్ చేసి ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ను చూపించబోతున్నారని టీజర్ చూస్తే తెలుస్తోంది. వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తున్న సుహాస్ ‘ప్రసన్నవదనం’తో ఓ కొత్త కాన్సెప్ట్ కోసం ప్రయత్నిస్తున్నారు. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.