Tamanna : మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగులో మంచి పేరు సంపాదించుకుంది. ఎక్కడ కూడా తన పరిధి దాటకుండా నటించిన ఆమె ప్రస్తుతం పరుధులు దాటుతోంది. పరువాల ప్రదర్శనకు తెర తీస్తోంది. లస్ట్ స్టోరీస్ 2 లో విచ్చలవిడిగా నటించి అందరిని పరేషాన్ చేస్తోంది. తమన్నా ఇంతలా మారిపోయిందా అని అందరు పెదవి విరుస్తున్నారు. డబ్బుల కోసమేనా ఇంత దిగజారడం అని విమర్శలు వస్తున్నాయి. ఆమెకు ఏం తక్కువ అయింది అలాంటి పాత్రలు చేయడానికి అని శాపనార్థాలు పెడుతున్నారు.
రొమాంటిక్ సన్నివేశాల్లో శృంగార భరితంగా నటించింది. ఇంత బోల్డ్ గా నటించడం ఎన్నడు చూడలేదని అందరు ఆశ్చర్యపోతున్నారు. తమన్నా ఇంతలా రెచ్చిపోయి నటిస్తుందా అని అనుకుంటున్నారు. రీసెంట్ గా జీకర్దా సిరీస్ లో టూ బోల్డ్ గా నటించింది. ఇప్పుడు హాట్ హాట్ గా నటించి అందరు నోళ్లకు బంధం వేసింది. ఏంటి ఇంత హీనంగా తమన్నా నటించిందా అనే విధంగా మారింది.
తమన్నా ఈ రొమాంటిక్ సీన్ లో నటించడానికి ముందు ప్రాక్టీస్ కూడా చేసిందట. దీంతోనే ఆమె అంత బాగా నటించిందని పలువురు వాదన. తెలుగు పరిశ్రమలో ఆమెకు ఎంతో మంచి పేరు ఉంది. కానీ ఇప్పుడు మాత్రం అందరు తిట్టిపోస్తున్నారు. ఏం రోగం వచ్చింది ఆమెకు ఇంతలా బరితెగించడం ఏమిటని అంటున్నారు. డబ్బుల కోసమే అయితే ఇంతలా బరితెగించాలా? అని విమర్శలు చేస్తున్నారు.
టాలీవుడ్ లో ముద్దుగుమ్మగా పేరుతెచ్చుకున్న తమన్నా ఇప్పుడు ముదురు గుమ్మగా భావిస్తున్నారు. తన అందంతో అందరిని మెప్పించిన తమన్నా వెబ్ సిరీస్ కోసం ఇంతలా బరితెగించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. భవిష్యత్ లో ఇంకా ఎంతకు తెగిస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిల్కీ బ్యూటీ కాస్త శృంగార బ్యూటీగా మారిందని ఆరోపణలు వస్తున్నాయి.
ReplyForward
|