Chandrababu: అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా సాగుతున్నాయి. పార్టీల మధ్య పొత్తుల అంశాన్ని తేల్చేందుకు ప్రధాన పార్టీల అధినేతలు స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగానే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ఢిల్లీకి పయనం అవను న్నారు.చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకుని అక్కడ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలనున్నారు.
ఈ భేటీలో బీజేపీతో పొత్తు అంశంపై ప్రధానంగా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే టీడీపీ-జనసేన మధ్య పొత్తు కన్ఫామ్ అయ్యింది. ఇక బీజేపీ కూడా కలిసొస్తే బాగుంటుందని టీడీపీ, జనసేన అధినేతలు భావిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసి ఏపీలో పోటీ చేశాయి. ఇప్పుడు ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం మిగిలి ఉండటంతో.. పొత్తుల అంశాన్ని తేల్చాలని డిసైడ్ అయ్యారు మూడు పార్టీల అగ్రనేతలు.
టీడీపీతో జత కట్టేందుకు ఇంతకాలం ఊగిసలాడుతూ వస్తున్న బీజేపీ.. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోందట.దాదాపు పొత్తు పెట్టుకుంటేనే బెటర్ భావిస్తోందట కమలం పార్టీ. ఈ క్రమంలోనే పొత్తులకు సంబంధించి సంకేతాలను టీడీపీ, జనసేన అధినేతలకు పంపించారట.
చంద్రబాబు ఢిల్లీ టూర్‌లో ఈ పొత్తుల అంశం దాదాపు ఫైనల్ అవుతుంది.బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. 2014 మాదిరిగానే.. 2024లోనూ మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి.ఈ పొత్తుల అంశంపై ఏ టర్న్ తీసుకుంటుందో మరో రెండు రోజుల్లో తేలిపోతుందని మాత్రం కన్ఫామ్‌గా చెప్పుకోవచ్చు.