Akhil Akkineni : యువ హీరో అఖిల్ తాజా చిత్రం ‘ఏజెంట్’ ఆశించినంత విజయం సాధించలేకపోయింది.దీంతో ఈ హీరో నిరాశలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇకనుండి తన కెరీర్ లో భారీ యాక్షన్ గల చిత్రాల జోలికి పోకూడదని అనుకున్నట్లు తెలుస్తుంది. ఈ తరహా మూవీల్లో నటించి మళ్ళీ ఇబ్బంది పడొద్దని అఖిల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఇక నుంచి నటించబోయే సినిమాల ఎంపిక విషయంలో కుటుంబ పెద్దల సూచనలు పాటించాలనుకుంటున్నాడు అఖిల్. తన సినిమాల్లో మసాలా కంటెంట్ లేకుండా ఎక్కువ శాతం కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ను కలవగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తరహా లో ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తో ఒక కథను చెప్పినట్లు వినికిడి. ఇది లవ్, కామెడీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఇంతకు ముందు తను నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని ఫ్యామిలీ స్టోరీస్ వల్ల తన కెరీర్ బాగుంటుందని అనుకుంటున్నాడు అఖిల్.
అయితే శ్రీకాంత్ అడ్డాల ఫ్యామిలీ ఎమోషన్స్ ను మంచిగా పండించడంలో గుర్తింపు పొందిన విషయం మనందరికి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయితే అఖిల్ కెరీర్ లో మరొక సూపర్ హిట్ అందుకునే ఛాన్స్ ఉందని చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నారు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో వస్తున్న చిత్రం “పెద్దకాపు 2” విడుదలకు సిద్ధంగా ఉంది. లవ్, ఎమోషనల్స్ ఉన్న
హై-ఆక్టేన్ పొలిటికల్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. ఈ మూవీ పాతకాలంనాటి గోదావరి బ్యాక్‌గ్రౌండ్ లో తీశారని తెలుస్తోంది. సినిమా ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమా కూడా ఖచ్చితంగా
బ్లాక్ బస్టర్ అవుతుందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.