celebrities సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు.. అయితే కొంత మంది మాత్రమే ఈ పోటీ ప్రపంచంలో రాణించే సత్తా ఉంటుంది.. కొంత మందికి ఎంట్రీ ఇచ్చిన సినిమా తోనే మంచి పేరు వస్తుంది. మరి కొంత మంది ఎన్నో ఏళ్లకు గాని క్లిక్ అవ్వలేరు.. మరి కొంత మంది సినీ ప్రముఖులకు మొదటి సినిమా తోనే పేరు రావడమే కాకుండా ఆ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నటులు ఉన్నారు. మరి ఆ సెలెబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
దిల్ రాజు : ప్రజెంట్ టాలీవుడ్ లో ఉన్న నిర్మాతల్లో దిల్ రాజు టాప్ లో ఉన్నారు. ఈయన ప్రొడ్యూసర్ గా మారిన మొదటి సినిమా దిల్.. అందుకే ఈ సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు.
సిరివెన్నెల సీహారామశాస్త్రి : ఈయన సినివెన్నెల సినిమాతో పాటల రచయితగా తన కెరీర్ స్టార్ట్ చేయడంతో అదే సినిమాను ఇంటి పేరుగా మార్చుకున్నారు.
సత్యం రాజేష్ : సత్యం సినిమాతో పేరు తెచ్చుకున్న రాజేష్ అప్పటి నుండి అదే పేరును కొనసాగిస్తున్నారు.
అల్లరి సుభాషిణి : అల్లరి సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించిన సుభాషిణి అప్పటి నుండి అదే పేరుతొ గుర్తింపు పొందింది.
బిమ్మరిల్లు భాస్కర్ : డైరెక్టర్ గా బొమ్మరిల్లు సినిమాతో స్టార్ట్ చేసిన భాస్కర్ అదే సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్నారు.
అల్లరి నరేష్ : అల్లరి సినిమాతో మొదటిసారి టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన నరేష్ అదే సినిమా పేరును కంటిన్యూ చేస్తున్నాడు.
వెన్నెల కిషోర్ : వెన్నెల సినిమాతో ఫేమస్ అయ్యి అదే పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు.
శుభలేఖ సుధాకర్ : శుభలేఖ సినిమాతో సుధాకర్ గారు చాలా గుర్తింపు తెచ్చుకోవడంతో అప్పటి నుండి అదే పేరును ఇంటి పేరుగా మార్చుకున్నారు.
బాహుబలి ప్రభాస్కర్ : ప్రభాస్ ఎన్నో సినిమాల్లో నటించిన బాహుబలి తర్వాతనే బాగా గుర్తింపు రావడంతో అదే పేరును కంటిన్యూ చేస్తున్నాడు.