19.8 C
India
Sunday, February 25, 2024
More

  Mahaneta NTR: మహానేత ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన ప్రముఖులు

  Date:

   

   

  తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వర్ధంతి నేడు.  ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ కు  వేకువజామునే  చేరుకుని ఆయన మనవళ్లు, సినీనటులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళులర్పించారు. పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవడంతో ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద  సందడి వాతా వరణం నెలకొంది.  కుటుంబ సభ్యుులే కాకుండా పలువురు టిడిపి నేతలు ఎన్టీఆర్ కు ని వాళ్లు అర్పించారు.  తెలుగు వారి  ఆత్మగౌరవం  కోసం ఆనాడు సినిమా లను వదులుకోని రాజకీయాల్లోకి వచ్చారని ఆయన చేసిన మేలును పలువురు గుర్తుచేసుకున్నారు.

  నందమూరి బాలకృష్ణ: ఎన్టీఆర్‌ అంటే నవరసాలకు అలంకారమని ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించారు. పేదల సంక్షేమానికి ఎన్టీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. నివాళులర్పించిన వారిలో నందమూరి రామకృష్ణ, సుహాసిని తదితరులు ఉన్నారు.

  పురందేశ్వరి:నందమూరి తారకరామారావు వ్యక్తి కాదని.. ఒక ప్రభంజనమని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని పటమట సర్కిల్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లా డారు. ‘‘ఎన్టీఆర్‌ తెలుగు కళామతల్లి ఆశీర్వాదం పొందారు. సంక్షేమం అనే పదానికి మారుపేరు ఆయనది. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి బియ్యంతో ఆదుకున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తెలుగువారు ఆత్మగౌరవంతో తలెత్తుకోగలుతున్నారంటే దానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ ఒకరు. అందుకే ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు’’ అని అన్నారు.

  Share post:

  More like this
  Related

  TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

  TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

  Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

  Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

  SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

  SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

  Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

  Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  NTR : కక్కినకూటికి ఆశపడని అభిమాన ధనుడు ఎన్టీఆర్.. జూనియర్ ఎన్టీఆర్ చేవ చచ్చిందా..? సత్తా ఉడిగిందా..!

    ఎన్టీఆర్ అంటే నిలువెత్తు ఆత్మాభిమానం.. ఎన్టీఆర్ అంటే లీడర్, నెవర్ ఎ ఫాలోవర్...

  NTR : తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన నేత ఎన్టీఆర్

  NTR : తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన నాయకుడు ఎన్టీఆర్. రాజకీయాలకు కొత్త...

  NTR : తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ నిలబెట్టారు..ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

                    AP: సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందే ఎన్టీఆర్ అని ఏపీ బీజేపీ చీఫ్...

  Lakshmi Parvathi : జూ.ఎన్టీఆర్ చేతికి టీడీపీ పగ్గాలు..!

  Lakshmi Parvathi : చంద్రబాబు, లోకేష్ ఉన్నంత కాలం జూ.ఎన్టీఆర్ ను...