Telugu Movies :
ఇప్పుడు తెలుగు సినిమా ఖ్యాతి పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సినిమాలను సైతం ఢీకొంటున్నాయి. ఇందులో భాగంగానే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావడం జరిగింది. విదేశీయుల చిత్రాలతో పోటీ పడుతూ నిలుస్తున్నాయి. బాహుబళి కూడా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా మారుస్తున్నాయి.
ప్రస్తుతం సీక్వెల్ లు కూడా బాగానే వస్తున్నాయి. బయోపిక్ లు కూడా తీస్తున్నారు. బాహుబళి, కేజీఎఫ్, పొన్నియన్ సెల్వన్ వంటి చిత్రాలు సీక్వెల్ గా వచ్చాయి. రెండు భాగాలుగా తెరకెక్కించారు. అయినా అవి విజయం సాధించి మన శక్తి సామర్థ్యాలేమిటో నిరూపించాయి. బాహుబలి రెండు సిరీస్ లలో 2303 కోట్లు రాబట్టాయి. కేజీఎఫ్ రూ. 1500 కోట్లు సంపాదించాయి. ఇలా తెలుగు వారి సత్తా పెంచుతున్నాయి.
బాలీవుడ్ లో సైతం పలు చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. దక్షిణాదిలో లోకేష్ కనగనక రాజ్ యూనివర్స్ పేరుతో సినిమాలు చేసి నిరూపించుకున్నాడు. గతేడాది విక్రమ్ సినిమాలో విజయం అందుకుని తనలోని సత్తా చాటాడు. రజనీకాంత్, ప్రభాస్, రాంచరణ్ వంటి వారు కూడా సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు.
ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, పఠాన్, వార్ వంటి నాలుగు చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా రూ.2424 కోట్లు వసూలు చేశాయి. రోహిత్ శెట్టి నాలుగు చిత్రాలకు రూ.1049 కోట్లు రాబట్టారు. 2017లో విడుదలైన టైగర్ జిందా హై రూ. 565 కోట్లు వసూలు చేసింది. 2019లో వార్ సినిమాకు రూ. 475 కోట్లు వచ్చాయి. 2023లో విడుదలైన పఠాన్ సినిమాకు రూ.1050 కోట్లు వసూలయ్యాయి.