31.4 C
India
Sunday, April 28, 2024
More

    2023 Roundup : చిన్న సినిమాల మెరుపులు.. బలంగా నిలబడిన ‘బలగం’.. కాసులు కురిపించిన ‘బేబీ’

    Date:

    2023 hit small films
    2023 Roundup, hit small films

    2023 Roundup : ప్రస్తుతం టాలీవుడ్ అంటేనే పాన్ ఇండియా మూవీస్ కు కేరాఫ్ గా మారిపోయింది. మన దగ్గర అందరూ పాన్ ఇండియన్ హీరోలే. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్..లాంటి వారితో పాటు మిడ్ రేంజ్ హీరోలు నిఖిల్, సాయిధర్మతేజ్..లాంటి వారూ ఉన్నారు. భారీ బడ్జెట్ మూవీలతో ఇండియన్ సినీ మార్కెట్ ను టాలీవుడ్ షేక్ చేస్తున్నా.. చిన్న సినిమాలు కూడా తామేం తక్కువ తినలేదని  మెరుపులు మెరిపిస్తున్నాయి. చిన్న సినిమాలుగా వచ్చి పెద్ద విజయాలు అందుకున్నాయి. 2023లో వచ్చిన ఆ సినిమాలెంటో చూద్దాం..

    జనవరిలో సంక్రాంతి సంబరాలకు పెద్ద సినిమాల హవానే నడిచింది. పెద్ద సినిమాలకు పోటీగా వచ్చిన సంతోశ్ శోభన్ ‘కల్యాణం కమనీయం’ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. సుధీర్ బాబు ‘హంట్’ ఫట్ మంది. ఫిబ్రవరిలో ‘రైటర్ పద్మనాభం’తో చిన్న సినిమాల మెరుపులు ప్రారంభమయ్యాయి. సుహాస్ హీరోగా వచ్చిన ఈ మూవీ క్లీన్ కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించింది. ‘చాయ్ బిస్కెట్’, ‘మేమ్ ఫేమస్’ కూడా యూత్ ను అలరించాయి. ‘బుట్టబొమ్మ’, ‘వినరో భాగ్యం..’, ‘మిస్టర్ కింగ్’ పెద్దగా ఆడలేదు.

    ఇక మార్చిలో జబర్దస్త్ ఫేం వేణు డైరెక్షన్ లో వచ్చిన ‘బలగం’ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. పెట్టిన పైసలకు పదింతలు వసూలు చేసిన సినిమాగా నిలిచింది. తెలంగాణ నేపథ్యంగా కుటుంబ బంధాల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాలను ఆకట్టుకుంది. పాటలు, కామెడీ, ఎమోషన్స్.. ఇలా ఒక్కటేమిటి ఆడియన్స్ కు బోర్ అనేదే లేకుండా కథతో ప్రయాణం చేస్తారు. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ వేణులో ఇంత టాలెంట్ ఉందా అని అభినందించకుండా ఉండలేరు. చిన్న సినిమాల బలం చూపించిన కథ బలగం అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇక ఏప్రిల్, మేలో చిన్న సినిమాలు పెద్దగా రాలేదు. ‘‘అన్నీ మంచి శకునములే’’ వచ్చినా అంతగా ఆకట్టుకోలేదు.

    జూన్ లో వచ్చినా శ్రీవిష్ణు ‘సామజవరగమన’ నవ్వులు పూయించింది.  బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలే పంచింది. నష్టాల బాటలో ఉన్న నిర్మాత అనిల్ సుంకరకు కాస్త రిలీఫ్ ఇచ్చింది.  జూలైలో వచ్చిన ‘బేబి’ పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాకు ముందే ‘ఓ రెండు మేఘాలు..’ సాంగ్ సూపర్ హిట్ కావడం.. ఈ సినిమా ప్రమోషన్ కు అక్కరకొచ్చింది. ఆనంద్, వైష్ణవి, విరాజ్ ల ముక్కోణ ప్రేమకథ జనాలను మెప్పించింది. 10 కోట్లతో నిర్మితమైన ఈ మూవీ 80కోట్ల దాక వసూలు చేసి చిన్న సినిమాల స్టామినా ఏంటో నిరూపించింది. ఈ ఏడాది చిన్న సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గా ఈ మూవీ నిలిచింది.

    అక్టోబర్ లో వచ్చిన ‘మ్యాడ్’ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే సంపూర్ణేష్ బాబు ‘మార్టిన్ లూథర్ కింగ్’ కు మంచి ప్రశంసలు అందుకుంది.  నవంబర్ లో తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ క్రైమ్ కామెడీతో అలరించింది. అలాగే ‘పొలిమేర-2’ కూడా ఆడియన్స్ ను మెప్పించింది. చాలాకాలం తర్వాత శ్రీకాంత్ చేసిన ‘కోటబొమ్మాళి పీఎస్’ కూడా జనాలను బాగానే ఆకట్టుకుంది. ఇందులోనే ‘లింగిడి’ సాంగ్ తెలుగునాట దుమ్మురేపింది.

    డిసెంబర్ లో కొన్ని సినిమాలు వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. యాంకర్ సుమ తనయుడు రోషన్ ‘బబుల్ గమ్’ మూవీతో తెరంగ్రేటం చేయనున్నాడు. ఇది ఈ ఏడాది చివర్లో రానుంది. మొత్తానికి 2023లో బలగం, సామజవరగమన, బేబీ, మ్యాడ్..దుమ్మురేపాయి. థియేటర్లలో అంతంత మాత్రంగా ఆడిన సినిమాలను ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుండడం విశేషం.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hero Vishal : హిరో విశాల్ సంచలన వ్యాఖ్యలు.. చిన్న సినిమాలు తీయొద్దు

    Hero Vishal : హిరో విశాల్ తమిళ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని...

    Small Films : అన్ని ‘చిన్న సినిమాలు’ ఒకే తేదీన రిలీజ్ అవుతున్నాయి.. కారణం ఏంటి?

    Small Films : ఇప్పటికే విడుదలవుతున్న భారీ సినిమాల కారణంగా సంక్రాంతి...

    Drug Case : టాలీవుడ్ కు మరో డ్రగ్ కేసు ఉచ్చు.. ఈ సారి యంగ్ హీరో.. పట్టుబడిన అతడి లవర్ 

    Drug Case : టాలీవుడ్ ను డ్రగ్స్ వీడడం లేదు. ఒక...

    Nandamuri Mokshagna:నందమూరి ఫ్యాన్స్ కు శుభవార్త.. టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న మోక్షజ్ఞ!

    నందమూరి బాలకృష్ణ  కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం చాలాకాలంగా అభిమామనులు...