37.7 C
India
Sunday, April 28, 2024
More

    Nandamuri Mokshagna:నందమూరి ఫ్యాన్స్ కు శుభవార్త.. టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న మోక్షజ్ఞ!

    Date:

    నందమూరి బాలకృష్ణ  కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం చాలాకాలంగా అభిమామనులు ఎగ్జైటెడ్‌గా ఎదురుచూస్తున్నారు. గతంలో అనేకసార్లు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించి వార్తలు నెట్టింట స్ప్రెడ్ అయ్యా యి. అలాగే లాంచింగ్ ప్రాజెక్ట్‌కు పూరీ జగన్నాథ్ వంటి దర్శకుల పేర్లు కూడా వినిపించాయి.  మరో ప్రక్క  ఈవెంట్స్‌లో మోక్షజ్ఞ బొద్దుగా కనిపించడంపై హీరోగా సెట్ అవుతాడా? అనే కామెంట్స్ కూడా నెటిజన్ల నుంచి వ్యక్తమయ్యాయి. ఇక ఇండస్ట్రీలో బాలయ్య లెగసీని కొనసాగించాలంటే ఆషామాషీ వ్యవహారం కాదనేది అభిమానులు అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం యాక్టింగ్, డాన్స్ తదితర విషయాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు మోక్షజ్ఞ.

    అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం వైజాగ్ సత్యానంద్ దగ్గర గత నవంబర్ నుంచి నట శిక్షణ తీసుకుంటున్నారు. మరో ప్రక్క బరువు తగ్గటం, ఫిజిక్ పై శ్రద్దపెట్టడం వంటివి చేసి కొత్త లుక్ లో కనపడేందుకు ప్రయత్నించబోతున్నారు. ఇక నటుడిగా కెరీర్ ప్రారంభించాలకునే వారికి కేర్ అఫ్ అడ్రెస్స్ వైజాగ్ సత్యానంద్ చిరంజీవి ఫామిలీ నుంచి వచ్చిన హీరోలకు,  ప్రభాస్ కు, అలాగే ,  మన టాలీవుడ్ స్టార్ హీరోలు చాలా మందికి సత్యానంద్ నటనలో శిక్షణ ఇచ్చారు. ఎంతో మంది కొత్త పాత తరం వారికి గురువు ఆయన.

    ఇక మోక్షజ్ఞ  ఎప్పుడు తెరపై కనిపిస్తాడనే ప్ర‌శ్న‌ను బాల‌కృష్ణ‌ను అడిగితే అదిగో ఇదుగో అంటున్నారు. నిజానికి 2017లోనే తన కొడుకు మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని బాలయ్య క్లారిటీ ఇచ్చారు. ఓ దశలో అయితే మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ ‘ఆదిత్య 369’ సీక్వెల్ అని కూడా ప్రచారం జరిగింది.   ఇప్పుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ తొలి సినిమాను ఎవ‌రు డైరెక్ట్ చేస్తార‌నే విష‌యం కూడా టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. బోయపాటి శ్రీను స‌హా ఇప్ప‌టికే చాలా మంది డైరెక్ట‌ర్స్ పేర్లు వినిపించాయి. మ‌రి ఎవ‌రు డైరెక్ట్ చేస్తారు? అస‌లు మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది? నిర్మాత‌లు ఎవ‌రు? వంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దాదాపు దొరికేసినట్లే .

    మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంది. బాలయ్య,బోయపాటి కాంబోలో ‘అఖండ 2’ సినిమా రాబోతుంది. ఇప్పటికే, బోయపాటి శ్రీను ‘అఖండ 2’ సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేశాడు. కాగా ఈ సినిమాలో నందమూరి మోక్షజ్ఞ కోసం బోయపాటి ఓ స్పెషల్ పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.ఖచ్చితంగా అఖండ 2లో బోయపాటి దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుంది. ఈ వార్త విని నందమూరి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అయితే ఇది అఫీషియల్ సమాచారం కాదు.

    Share post:

    More like this
    Related

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi : ఉమెన్స్ డే సందర్భంగా దేశ ప్రజలకు మోదీ గుడ్ న్యూస్..

    PM Modi : ఉజ్వల పథకం లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్...

    Good news : వాహనదారులకు శుభవార్త…పెండింగ్ చలాన్ల గడవు మరోసారి పొడిగింపు!

      తెలంగాణ: వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ చలాన్ల...

    Good News:అమెరికా వెళ్లే వారికి గుడ్ న్యూస్…వీసా రెన్యువల్ పై బైడెన్ కీలక నిర్ణయం

    ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లే వారికి బైడెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. H-1B...

    Drug Case : టాలీవుడ్ కు మరో డ్రగ్ కేసు ఉచ్చు.. ఈ సారి యంగ్ హీరో.. పట్టుబడిన అతడి లవర్ 

    Drug Case : టాలీవుడ్ ను డ్రగ్స్ వీడడం లేదు. ఒక...