BJP తెలంగాణలో ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ అయ్యాయి. పార్టీల అభ్యర్థులు కూడా ఖరారవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే జంబో లిస్ట్ ఒకటి రెడీ చేసుకుంది. ఇక అధినేతే ప్రకటన తరువాయి అన్నట్లు ఉంది. ఇక కాంగ్రెస్ కూడా ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది. ఇందుకోసం స్పెషల్ గా ఒక కమిటీని వేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా తమ అభ్యర్థులను ఫైనల్ చేసింది. అమిత్ షా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తున్నది. అయితే ఇందులో కీలక నేతలు ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు బండి సంజయ్, సోయం బాపురావ్, ధర్మపురి అరవింద్ ను కూడా అసెంబ్లీ అభ్యర్థులుగా ప్రకటించినట్లుగా సమాచారం. అయితే కొత్తగా చేరిన సినీనటి జయసుధను కూడా సికింద్రబాద్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధం చేస్తున్నది.
కిషన్ రెడ్డి – అంబర్ పేట్,
కే. లక్ష్మణ్ – ముషీరాబాద్
బండి సంజయ్ – కరీంనగర్,
సోయం బాపూరావు – బోథ్,
ధర్మపురి అరవింద్ – ఆర్మూర్,
ఈటెల రాజేందర్ – గజ్వేల్,
రఘునందన్ రావు – దుబ్బాక,
డీకే అరుణ – గద్వాల,
జితేందర్ రెడ్డి – మహబూబ్ నగర్ లేదా నారాయణ్ పేట్
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – మునుగోడు,
మురళీధర్ రావు – వేములవాడ లేదా కూకట్ పల్లి,
ఎన్. ఇంద్రసేనా రెడ్డి – ఎల్బీ నగర్,
వివేక్ – చెన్నూరు,
విజయశాంతి – మెదక్,
యెండల లక్ష్మి నారాయణ – నిజామాబాద్ అర్బన్,
రామచంద్ర రావు – మల్కాజ్ గిరి,
ఎన్వీఎస్ఎస్ ప్రసాద్ – ఉప్పల్,
ఆచారి – కల్వకుర్తి,
జయసుధ – సికింద్రాబాద్,
మహేశ్వర్ రెడ్డి – నిర్మల్,
రాథోడ్ రమేష్ – ఆసిఫాబాద్,
పొంగులేటి సుధాకర్ రెడ్డి – ఖమ్మం,
బాబు మోహన్ – ఆందోల్,
నందీశ్వర్ గౌడ్ – పటాన్ చెరువు,
బూర నర్సయ్య గౌడ్ – భువనగిరి
విలాస్ రెడ్డి జంబుల (NRI) – ఇబ్రహీంపట్నం,
విశ్వేశ్వర్ రెడ్డి – తాండూర్,
గరికపాటి మోహనరావు – వరంగల్,
ఈటల జమున – హుజురాబాద్,
జుక్కల్ (NRI) – బుచ్చన్న గాజుల,
రాజా సింగ్ – గోషామహల్