
This controversial politician : ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామ క్రిష్టంరాజు తరువాత రెబల్ ఎంపీగా మారాడు. సొంత పార్టీలోనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఇలా రాష్ర్ట రాజకీయాల్లో రెబల్ నేతగా గుర్తింపు పొందారు. వైసీపీ ఎంపీ అంటే ఎవరు నమ్మరు. వైసీపీ రెబల్ ఎంపీ అంటేనే ఆయనకు గుర్తింపు ఉంటుంది. అలా పార్టీలో ఉంటూ అధినేతను ప్రశ్నిస్తున్న ఆయన తనదైన భావజాలంతో వైసీపీలో దడ పుట్టిస్తున్నారు.
ప్రస్తుతం రాబోయే ఎన్నికలకు ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీలో చేరతారనే దాని మీదే అందరికి ఆసక్తి ఏర్పడింది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆయన రెబల్ గా మారినట్లు ఆరోపణలున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున కాకుండా బీజేపీ, జనసేన పార్టీల్లో ఏదో ఒక పార్టీలో చేరి టికెట్ సాధించుకోనున్నారని సమాచారం.
టీడీపీలో చేరితే వైసీపీ చేస్తున్న ఆరోపణలకు ప్రాణం పోసినట్లు అవుతుందనే ఉద్దేశంతో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే వాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రఘురామ ప్లాన్ ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేదు. జగన్ కు కంటి మీద కునుకు లేకుండా చేసేది ఆయనే. సొంత పార్టీలోనే వేరు కుంపటి పెట్టి జగన్ ను విమర్శించడం ఆయనకు కొత్తేమీ కాదు. దీంతో వైసీపీకి కొరకరాని కొయ్యగా మారాడు.
ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయించాలని జగన్ ఎన్నోమార్లు ప్రయత్నించినా కుదరలేదు. కోర్టుల వరకు కూడా వెళ్లారు. అయినా ఏం జరగలేదు. పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయించాలని కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అవి కూడా ఫలించలేదు. ఇలా ఆయనను ఎన్ని విధాలుగా కట్టడి చేద్దామని ప్రయత్నించినా కుదరలేదు. దీంతో వైసీపీ నేతలు తలలు పట్టుకోవడం తప్ప సాధించేమీ లేదు.
ఈ నేపథ్యంలో ఆయన చిన్ననాటి ఫొటో ఒకటి నెట్లో వైరల్ గా మారింది. తన చిన్నతనంలో తీసిన ఫొటో కావడంతో దాన్ని అందరు ఆసక్తిగా చూస్తున్నారు. అంత చిన్న తనంలో తన ఫొటో ఎలా ఉందనే అభిప్రాయాలు ఆయన అభిమానుల నుంచి వస్తున్నాయి. వైసీపీని గడగడలాడిస్తున్న ఎంపీ అప్పుడు ఎలా ఉన్నారో చూడండి.