34 C
India
Monday, May 6, 2024
More

    Trivikram Srinivas : త్రివిక్రమ్ కలిసి వస్తున్న ఇల్లు.. సెంటిమెంట్ తోనే హిట్ కొడుతున్న దర్శకుడు

    Date:

    Trivikram Srinivas
    Trivikram Srinivas
    Trivikram Srinivas

    ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టయిల్ ఉంటుంది. ఇక సెంటిమెంట్ కూడా. ఫేమస్ దర్శకుడు వంశీ సినిమా తీశాడంటే చాలు అందులో గోదావరి, ఆ నది చుట్టూ పరిసరాలు ఉండాల్సిందే. గోదావరి లాగానే ఇండియాలో చాలా నదులు ఉన్నాయి. కానీ ఆయన సెంటిమెంట్ మాత్రం గోదావరి చుట్టే తిరుగుతుంది.

    ఇక శ్రీను వైట్ల, కోన వెంకట్ వీరి సినిమాలు ఎలా మొదలైనా ఓ ఇంట్లోకి చేరి కన్ఫ్యూజన్ కామెడీ క్రియేట్ అవుతుంది. ఇక కృష్ణవంశికి పెద్ద కుటుంబం ఉంటేనే సినిమా తీస్తాడు. లేదా పెద్ద కుటుంబాన్ని క్రియేట్ చేస్తాడు. దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కు కూడా ఇలాంటి సెంటిమెంట్ ఉందంటే నమ్ముతారా? నిజమండి బాబు అతనికి ఉన్నది ఇళ్ల సెంటిమెంట్ ఆయన డైరెక్షన్ లో వచ్చిన చాలా సినిమాల్లో ఓ ఇంటి సెట్ ఉండాల్సిందే.

    ఇప్పటికీ ఇండస్ట్రీలో ఒక కామెంట్ ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ రాయడం మొదలు పెట్టడంతోనే ఆర్ట్ డైరెక్టర్ ను కూడా పిలిపించుకుంటాడు. ఫస్ట్ ఆయన కథకు తగ్గట్లుగా ఇంటి సెట్ ప్లాన్ చూపించాలి. ఆ తర్వాతే కథ మొత్తం పూర్తి చేస్తారు. కొన్ని విషయాలను పరిశీలిస్తే అది నిజమే అనిపిస్తుంది.

    * అతడు మూవీలో చాలా సినిమా నాజర్ ఇంట్లోనే జరుగుతుంది. సినిమాలో ఎక్కువ భాగాన్ని అక్కడే చిత్రీకరించారు. ఆ సినిమాకు సంబంధించి ఆ ఇల్లు స్పెషల్.

    * జల్సాలో పవన్ కల్యాణ్ అద్దె ఇళ్లు. కింద పవన్ కల్యాణ్, పైన ఇలియానా ఉండేలా సెట్ వేశారు. అక్కడే కామెడీ సీన్లు చేశారు.

    * జులాయిలో సినిమాలో ఎక్కువ భాగం రాజేంద్రప్రసాద్ ఇంటిలోనే కథ నడుస్తుంది.

    * అత్తారింటికి దారేదిలో రావు రమేశ్-నదియా దంపతుల ఇళ్లు కీలకం. చాలా సినిమా పోర్షన్ అక్కడే నడుస్తుంది.

    * ఇక, సన్నాఫ్ సత్యమూర్తిలో ఉపేంద్ర ఇంట్లో కథ కీలకంగా మలుపుతిరుగుతుంది.

    * అ.. ఆలో సమంత మేనత్త ఇంటికి వచ్చిన తర్వాత చాలా కథ అక్కడే చిత్రీకరించాడు.

    * అజ్ఞతవాసి డిఫరెంట్‌గా చేద్దామనేమో తెలియదు కానీ ఇంటికి బదులు ఆఫీస్ ను తీసుకున్నారు. అది యాంటీ సెంటిమెంట్ అయిపోయింది.

    * అరవిందసమేతలో హీరోయిన్ (పూజా హెగ్డే) ఇళ్లు.

    * అల వైకుంఠపురములో టైటిల్ లోనే సినిమా మొత్తం వైకుంఠపురం అనే ఇంటిలోనే సాగుతుంది.

    * ఇక, ఇప్పుడు గుంటూరు కారం. ఈ కథను కూడా రెండు ఇళ్ల మధ్య ఉంటుందని తెలుస్తోంది. తాత ప్రకాశ్ రాజ్ (గుంటూరు దగ్గర పల్లెటూరు) ఇల్లు, ఇక రెండోది హీరో తల్లి హైదరాబాద్ లో ఉండే ఇల్లు అని గాసిప్ లు ఉన్నాయి.

    మొత్తం మీద త్రివిక్రమ్ పుణ్యమా అని ఆర్ట్ డైరెక్టర్లు బతికిపోతున్నారు. రకరకాల ఇళ్ల సెట్లను వేసి చూపిస్తున్నారు. ప్రతి ఇల్లు యూనిక్ అనే చెప్పాలి.

    Share post:

    More like this
    Related

    ASI Murder : ఏఎస్సైని ట్రాక్టర్ తో తొక్కించి హత్య

    ASI Murder : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఓ ఏఎస్సైని...

    Jagan Viral Video : సార్..సార్..ఏంటి సార్ ఇది..ఎక్కడ పట్టుకొస్తారండి ఇలాంటి ఆర్టిస్టులని..

    Jagan Viral Video : ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేని...

    Prabhas Kalki : ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’పై రాణా సంచలన కామెంట్.. వరల్డ్ వైడ్ గా ఏమవుతుందంటే?

    Prabhas Kalki : పురాణాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవించి దర్శకుడు...

    Mumbai Indians : సన్ రైజర్స్ ను ముంబయి ఇండియన్స్ అడ్డుకునేనా?

    Mumbai Indians : ముంబయి ఇండియన్స్, సన్ రైజర్స్ మధ్య సోమవారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Trivikram : త్రివిక్రమ్ లో పస తగ్గిందా? నెటిజన్ల ఆగ్రహం

    Trivikram : టాలీవుడ్ లో మంచి పేరున్న దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్...

    Producer Kona Venkat : జగన్‌ పాలనపై ప్రశంసలు కురిపించిన ప్రముఖ నిర్మాత కోన వెంకట్

        టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కోన వెంకట్ వైఎస్‌ జగన్‌ పాలనపై ప్రశంసలు...

    Trivikram Srinivas : త్రివిక్రమ్ మల్టీస్టారర్.. మరో ‘నువ్వు నాకు నచ్చవ్’  పక్కా!

    Trivikram Srinivas : త్రివిక్రమ్.. మాటల మాంత్రికుడు.. ప్రాసలు, పంచ్ లతో...

    Guntur Kaaram : మహేశ్ బాబు సినిమాలోని వీడియో సాంగ్ లీక్.. శ్రీలీల డ్యాన్స్ కు నెటిజన్ల ఫిదా..

    Guntur Kaaram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్-సూపర్ స్టార్ మహేశ్...