29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Varun-Lavanya cutest couple : వరుణ్, లావణ్య అందమైన జంట : చిరంజీవి

    Date:

    Varun-Lavanya cutest couple
    Varun-Lavanya cutest couple, Chiranjeevi-Surekha

    Varun-Lavanya cutest couple : ఇప్పుడు ఎక్కడ చూసినా వరుణ్, లావణ్యల నిశ్చితార్థం టాపిక్ మీదే చర్చ నడుస్తోంది. వారి జంట చూడ ముచ్చటగా ఉందని అందరు కితాబిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా వారిని ఆశీర్వదించారు. వారికి బోకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారి జీవితంలో వివాహం ఓ మధుర ఘట్టం కావాలని ఆకాంక్షించారు. వారికి అందరు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

    2016 నుంచే వారు ప్రేమలో ఉన్నారు. ఇప్పటికి పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. సినిమాలోని వారినే చేసుకోవడం కొత్తేమీ కాదు. గతంలో కూడా చాలా జరిగాయి. కానీ వీరు కొత్తగా పెళ్లి చేసుకుంటుంటుండంతో అందరి కళ్లు వీరి మీదే ఉన్నాయి. మెగా కుటుంబం నుంచే కాకుండా బయట వారు కూడా వారికి బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు.

    వరుణ్ చెల్లి నిహారిక ట్విటర్ ద్వారా వదినకు స్వాగతం అంటూ పోస్టు పెట్టింది. ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది. అన్నయ్యా ఈ రోజు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నానంటూ పోస్టు చేసింది. దీంతో అభినందనల వెల్లువ కొనసాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా వరుణ్, లావణ్యల జంట చూడ ముచ్చటగా ఉందని ట్విటర్ లో రాసుకున్నారు.

    జూన్ 9న నాగబాబు ఇంట్లో వరుణ్, లావణ్యల నిశ్చితార్థం జరిగింది. దీనికి మెగా కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. బయట వారెవరిని ఆహ్వానించలేదు. పెళ్లికి పిలవొచ్చని వారి కుటుంబానికి చెందిన వారే పాల్గొన్నారు. వరుణ్, లావణ్య జంటను ఆశీర్వదించారు. పవన్ కల్యాణ్, రాంచరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అరవింద్ పాల్గొని వారిని ఆశీర్వదించారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chiranjeevi : గద్దర్ సినిమా అవార్డ్స్ పై చిరంజీవి సంచలన ప్రకటన

    Chiranjeevi : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024పై అగ్ర కథానాయకుడు...

    Amaravati : అమరావతికి మెగాస్టార్ శోభ

    Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో జరగనున్న ఒక ప్రత్యేక కార్యక్రమం/పునఃప్రారంభోత్సవానికి...

    Singapore : పవన్ కుమారుడిని కాపాడిన కార్మికులను సన్మానించిన సింగపూర్ ప్రభుత్వం

    Singapore : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్...

    Chiranjeevi : పవన్‌ కుమారుడి గాయాలపై స్పందించిన చిరంజీవి

    Chiranjeevi : పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్ కుమారుడు మార్క్‌ శంకర్‌కు గాయాలైన...