Sankranthi 2024 : పండగ వేళ పట్నం నుంచి పల్లెలకు ప్రజలు క్యూ కడుతున్నారు. దీంతో రోడ్లన్ని రద్దీగా మారాయి. టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఎటు చూసినా రోడ్లన్ని కిలోమీటర్ల మేర నిలిచి ఉంటున్నాయి. దీంతో ప్రయాణం గంటల కొద్దీ ఆలస్యం అవుతోంది. ఇళ్లకు వెళ్లాలనే వారి ఆశలకు ఆలస్యం అవుతోంది.
ఈనేపథ్యంలో కీసర టోల్ గేట్ వద్ద వాహనాల క్యూ చూస్తే భయమేస్తోంది. ముందు వెనక చాలా మంది వాహనాలు నిలిచి ఉండటంతో ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనాలను త్వరగా పంపించేందుకు చర్యలు తీసుకోవాల్సిన వారు త్వరగా పంపించకపోవడంతో నెమ్మదిగా వెళ్తున్నాయి. సంక్రాంతి పండగ కావడంతో అందరు తమ ఇళ్లకు వెళ్లాలనే క్రమంలో సొంత వాహనాల్లో బయలుదేరి రోడ్ల మీదే నిలబడుతున్నారు.
సంక్రాంతి కావడంతో ఆంధ్రప్రాంతానికి చెందిన వారంతా సొంతూళ్లకు పయనమవుతున్నారు. టోల్ గేట్లు రద్దీగా మారాయి. వాహనాల వరస క్యూగా ఉండటంతో ఎటు చూసినా వాహనాలే కనిపిస్తున్నాయి. కిలోమీటర్ల మేర కార్లు నిలిచిపోతున్నాయి. పెట్రోల్ బంకుల్లో కూడా వాహనాలు నిలుస్తున్నాయి. సంక్రాంతి పండగ వేడుకల కోసం ప్రజలు బారులు తీరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పెద్ద పండగ. మన తెలంగాణలో దసరా పెద్ద పండగ. సంక్రాంతి వేళ ప్రజలు ఉద్యోగులు చేసే ప్రాంతం నుంచి తమ సొంత ఊర్లకు ప్రయాణం అవుతున్నారు. దీంతోనే రోడ్లన్ని వాహనాలతో నిండిపోతున్నాయి. తమ ఊరు చేరడానికి చాలా సమయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది.