Vijay Devarakonda :
పరిశ్రమకు వచ్చిన అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న నటుల్లో విజయ్ దేవరకొండ ఒకరు. సహజమైన నటుడు నానితో కలిసి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఎంట్రీ ఇచ్చాడు. తరువాత కాలంలో అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సూపర్ హిట్లతో తనదైన శైలిలో దూసుకుపోయాడు. ఇప్పుడు మంచి హీరోగా ఎదిగాడు. లైగర్ సినిమా ప్లాప్ అయినా సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తున్నాడు.
ప్రస్తుతం శివ నిర్మాణ అనే దర్శకుడితో ఖుషి సినిమా చేస్తున్నాడు. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో మరో సినిమాలో నటిస్తున్నాడు. విజయ్ దేవరకొండ టాలీవుడ్ టాప్ 3 డైరెక్టర్లలో సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ లెవల్లో సక్సెస్ ఇవ్వడంతో ఇప్పుడు పుష్ప2 కూడా అదే రేంజ్ లో చేయబోతున్నాడు. వీటికంటే ముందే విజయ్ తో సినిమా చేయాల్సి ఉన్నా సుకుమార్ వాయిదా వేస్తూ వస్తున్నాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తిస్తున్నాడు.
విజయ్ దేవరకొండ ఒప్పుకున్న సినిమాలు పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు చేపడతారని అంటున్నారు సోషల్ మీడియాలో గత కొంత కాలంగా వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టినట్లు అవుతుంది. విజయ్ దేవరకొండలో ఉన్న కమిట్ మెంట్ తో ఆయన సినిమాలు కూడా అదే రేంజ్ లో దూసుకుపోతుంటాయి. ఒక్కో సినిమాలో ఒక్కో వైవిధ్యం ఉన్న పాత్రలు చేస్తుంటాడు.
ఎన్నో ఆశలతో లైగర్ సినిమా మాత్రం నిరుత్సాహ పరచింది. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించి మెప్పించిన విజయ్ ప్రస్తుతం మంచి కథలు ఉంటేనే చేస్తున్నాడు. అందుకే ప్లాపులు రావడం లేదు. సినిమాల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మినిమమ్ గ్యారంటీతో సినిమాల నిర్మాణంపై దృష్టి పెడుతున్నాడు.