Ayesha Khan in Saree : విశ్వక్ సేన్ కొత్త చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో నటి అయేషా ఖాన్ నటించిన ఒక ప్రత్యేక గీతం ఉంది. స్లీవ్ లెస్ బ్లౌజ్, సిల్వర్ చెవిపోగులతో పాటు నీలం రంగు చీరను ధరించి తన కొత్త ఇన్ స్టా పిక్స్ లో ఆమె చాలా అద్భుతంగా కనిపిస్తోంది. ఆయేషా తన గ్లామరస్ లుక్ తో కెమెరాకు పోజులిచ్చింది. ఆమెను చూసే ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధుల్ని చేస్తూ ఆమె అందం మెరిసిపోతుంది. ఇంత స్టన్నింగ్ లుక్ తో ఆయేషా టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి తన నటనతో చెరగని ముద్ర వేస్తుందనడంలో సందేహం లేదు.
రైటర్.., డైరెక్టర్.., హీరో అయిన విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీ నుంచి అదిరిపోయే ఐటమ్ సాంగ్ వస్తుందని తెలిసిందే. మాస్ కా దాస్ విశ్వక్ సేన్తో ఆడిపాడబోయే ఐటెం భామ ఈషా రెబ్బా అని వార్తలు వినిపించాయి.
కానీ, కనిపించబోయేది బిగ్‌బాస్ సీజన్ 17 (హిందీ) ఫేం అయేషా ఖాన్ అని తెలుస్తోంది. ఈ భామ ఐటెం సాంగ్‌లో ఎలాంటి మెస్మరైజింగ్ స్టెప్పులు వేస్తుందోనని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. త్వరలో సాంగ్ అప్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సముద్రం ఒడ్డున నివసించే సాధారణ యువకుడు.. పెద్ద నాయకులకు ఎదురెళ్లి ఎలా నిలిచాడు? అనేది అసలు కథ అని తెలుస్తోంది. కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించనున్నారు.
View this post on Instagram