34 C
India
Saturday, May 11, 2024
More

    World Cup Records : హిస్టరీ రిపీట్ : వరల్డ్ కప్ లో భారీ విజయాలు ఇవే..

    Date:

    World Cup Records
    World Cup Records

    World Cup Records : ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలోనే అతి పెద్ద విజయం బుధవారం ఆస్ర్టేలియా నమోదు చేసింది. ఏకంగా 309 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ పై అలవోకగా గెలిచింది. ఈ మ్యాచులో ఆస్ర్టేలియా బ్యాట్స్ మెన్ చెలరేగి ఆడారు. ముందుగా టాస్ గెలిచిన ఆస్ర్టేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీతో అదరగొట్టాడు.  ఆయనకు స్టీవ్ స్మిత్(71 పరుగులు), మార్నస్ లబుషేన్ (62 పరుగులు) కూడా జత కలిశారు. ఇక చివరలో బ్యాటింగ్ కు దిగిన గ్లెన్ మ్యాక్స్వెల్ (106 పరుగులు) రెచ్చిపోయాడు. 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. దీంతో ఆస్ర్టేలియా జట్టు ఏకంగా 399 పరుగులు చేసింది.

    ఇక లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 21 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ విక్రమ్ జిత్ సింగ్ మాత్రమే కేవలం 25 పరుగులు చేశాడు. ఇంకెవరూ రాణించలేదు. దీంతో 309 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది.  ఇది అత్యంత దారుణమైన ఓటమి కావడం గమనార్హం.

    ఇక గతంలో చూసుకుంటే వరల్డ్ కప్ లో భారీ విజయం రికార్డు కూడా ఆస్ర్టేలియా పేరిటనే ఉంది. 2015లో అప్గానిస్థాన్ మీద 275 పరుగుల తేడాతో ఆస్ర్టేలియా గెలిచింది. ఇక 2007లో బెర్ముడా జట్టు మీద భారత్ 257 పరుగుల తేడాతో గెలిచింది. అదేవిధంగా 2015లో విండీస్ జట్టు పై దక్షిణాఫ్రికా 257 పరుగుల తేడాతో గెలిచింది. 2003లో నమీబియా జట్టు పై ఆస్ర్టేలియా 256 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక 2007లో పసికూన బెర్ముడా జట్టుపై శ్రీలంక జట్టు 243 పరుగుల తేడాతో గెలిచింది. ఇక 2011లో నెదర్లాండ్స్ జట్టుపై దక్షిణాఫ్రికా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.

    Share post:

    More like this
    Related

    Mangalagiri : మంగళగిరిలో రూ.25 కోట్లు సీజ్

    Mangalagiri : ఎన్నికల వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ...

    Ankita Tenth Marks : శభాష్ అంకిత..! – ‘పది’లో వంద శాతం మార్కులు సాధించిన విద్యార్థిని

    Ankita Tenth Marks : ఇటీవల ఏపీలోని పదో తరగతి ఫలితాల్లో...

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం – ప్రభాకర్ రావు అరెస్టుకు వారెంట్ జారీ

    Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dravid Continue as Coach : కోచ్ గా ద్రవిడ్ ను కొనసాగిస్తారా? ఇంటికి పంపిస్తారా?

    Dravid Continue as Coach : వన్డే ప్రపంచ కప్ ముగిసింది....

    Dravid Plan : సెమీస్ కు టీమిండియా రెడీ..ద్రావిడ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

    Dravid Plan : వరల్డ్ కప్ లో టీమిండియా ఎనిమిది వరుస...

    Miss the Catch : క్యాచ్ మిస్సయితే.. కప్పు మిస్సయినట్లే..!

    Miss the Catch : క్రికెట్ లలో ప్రతి దేశంలో కోరుకునే కల.....