అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ను పట్టిస్తే 25 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించింది NIA. దావూద్ ఆచూకీ చెప్పిన వారికి భారీ నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో NIA ఓ ప్రకటన.విడుదల చేసింది.
దావూద్ ఆచూకీ తెలిపిన వాళ్లకు 25 లక్షలు అలాగే దావూద్ అనుచరుడు చోటా షకీల్ ఆచూకీ తెలిపిన వాళ్లకు 20 లక్షల నగదు అందిస్తామని ప్రకటించింది NIA. 1993 లో ముంబైలో వరుస బాంబు పేలుళ్లకు సూత్రధారి దావూద్ ఇబ్రహీం. ముంబై పేలుళ్లతో పాటుగా దొంగ నోట్లు , అక్రమ మద్యం , డ్రగ్స్ స్మగ్లింగ్, పలు కిడ్నాప్ లు , హత్యలతో దావూద్ కు సంబంధం ఉంది. దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లో అలాగే దుబాయ్ లలో అక్రమ నివాసం ఏర్పరచుకున్నాడని పలు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. అయితే పాక్ మాత్రం దావూద్ మా దేశంలో లేడని అంటోంది.