భారత్ – చైనా ల మధ్య మరోసారి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో భారత్ చైనా లకు చెందిన సైనికులకు గాయాలయ్యాయి. గతంలో కూడా గాల్వన్ లోయలో చైనా – భారత్ సైనికులకు మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఆ గొడవలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది.
దాంతో అప్పటి నుండి భారత్ – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం విదితమే. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ దగ్గర ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇరు దేశాలకు చెందిన సైనికుల మధ్య తోపులాట జరగడంతో 30 మంది సైనికులు గాయపడ్డారు. గాయపడిన సైనికులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ సంఘటన డిసెంబరు 9 న జరుగగా ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘర్షణ విషయాన్ని కొద్దిసేపటి క్రితం ధృవీకరించారు సైనిక ఉన్నతాధికారులు.