కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చాడు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. గతకొంత కాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న ఆజాద్ ఈరోజు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నట్లుగా ప్రకటించాడు గులాం నబీ ఆజాద్. 5 పేజీల లేఖ సోనియా గాంధీకి పంపించాడు ఆజాద్.
కాంగ్రెస్ పార్టీ ఈ స్థితికి రావడానికి కారణం ముమ్మాటికీ రాహుల్ గాంధీనే అంటూ తీవ్ర ఆరోపణలు చేసాడు. సీనియర్లను పక్కన పెట్టి రాహుల్ ఘోరంగా అవమానించాడని , అందుకే పార్టీ ఇంతటి దారుణమైన ఫలితాలను పొందుతోందని ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆజాద్.
50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉందని, దాన్ని తెంచుకోవడం నా మనసుకు కష్టంగా ఉందని అయితే రాహుల్ నిర్ణయాల వల్ల నేను ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించాడు. గులాం నబీ ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా , కేంద్ర మంత్రిగా పలుదఫాలుగా కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. అలాగే కాంగ్రెస్ పార్టీలో పలు కీలక బాధ్యతలు కూడా చేపట్టాడు గులాం నబీ ఆజాద్.