ఇండియన్ స్టూడెంట్ ఆర్యా వోహ్రా (21 ) పై అమెరికన్ ఎయిర్ లైన్స్ నిషేధం విధించింది. తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన చేసినందుకు ఆర్యా వోహ్రా పై నిషేధం విధించింది అమెరికన్ ఎయిర్ లైన్స్. భవిష్యత్ లో తమ ఎయిర్ లైన్స్ లో వోహ్రా ప్రయాణించకుండా నిషేధం విధించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఇటీవల అమెరికా నుండి ఇండియాకు వచ్చిన విమానంలో ఆర్యా వోహ్రా ఢిల్లీకి బయలుదేరాడు. అయితే వోహ్రా మద్యం మత్తులో ఉండి తన తోటి ప్రయాణీకుడి మీదే మూత్ర విసర్జన చేసాడు. తనపై వోహ్రా మూత్ర విసర్జన చేసినప్పటికీ ఆ విషయాన్ని బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేయలేదు. అయితే విమాన సిబ్బంది మాత్రం అధికారులకు ఫిర్యాదు చేసారు. తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించడమే కాకుండా విమానయాన సిబ్బందితో గొడవ పడటంతో ఢిల్లీ పోలీసులు వోహ్రా ను అదుపులోకి తీసుకున్నారు. ఇక అమెరికన్ ఎయిర్ లైన్స్ తమ విమానాలలో భవిష్యత్ లో వోహ్రా ప్రయాణించకుండా నిషేధం విధించింది.