బ్రేకింగ్ న్యూస్ ……. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేశారు. 45 రోజుల క్రితమే బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో అతి తక్కువ సమయం పని చేసిన ప్రధానిగా రికార్డ్ సృష్టించింది. ఇటీవల లిజ్ ట్రస్ నేతృత్వంలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆ బడ్జెట్ వల్ల ఒక్కసారిగా బ్రిటన్ లో ఆర్ధిక సంక్షోభం నెలకొంది.
దాంతో లిజ్ ట్రస్ పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా పలువురు మంత్రులు కూడా రాజీనామా చేయడంతో చేసేదిలేక లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేసింది. లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది.