సాధారణంగా ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్లాలంటే వీసా తప్పనిసరి. మన భారతీయులు ఎక్కువగా అమెరికాకు వెళ్తుంటారు ఉన్నత చదువుల కోసం అలాగే ఉన్నత స్థాయి ఉద్యోగాల కోసం. అయితే అమెరికాతో పాటుగా ఆస్ట్రేలియా, కెనడా ,లండన్ లకు కూడా వెళ్ళేవాళ్ళు ఎక్కువ స్థాయిలోనే ఉంటున్నారు. సాధారణంగా ఒక దేశానికి వెళ్లాలంటే చదువుకునే వాళ్ళకు స్టూడెంట్ వీసా ఉంటే సరిపోతుంది. కానీ కెనడా లో మాత్రం ఒక్క స్టూడెంట్ వీసా ఉంటే సరిపోదు. పర్మిట్ వీసా కూడా ఉండాలి. లేకపోతే ఆ దేశంలోకి ఎంట్రీ లేదు.
అవును మిగతా దేశాలకు భిన్నంగా కెనడా వీసా నియమాలు ఉన్నాయి. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాలంటే ఆ దేశపు స్టూడెంట్ వీసా తో పాటుగా పర్మిట్ వీసా కూడా ఉండాలి. అప్పుడే ఆ దేశంలోకి అనుమతి ఉంటుంది. స్టూడెంట్ వీసాతో పాటుగా పర్మిట్ వీసా ఉన్నవాళ్లు తమ వెంట తమ భాగస్వామిని ఆ దేశానికి తీసుకొని వెళ్లొచ్చు.