అమెరికా వెళ్లే భారతీయులకు పలు ఆంక్షలు విధించింది అమెరికా ప్రభుత్వం. భారత్ నుండి అమెరికా వెళ్లే ప్రయాణీకులలో దాదాపుగా ప్రతీ ఒక్కరు ఏదో ఒక వ్యాధితో బాధపడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళు భారత్ నుండి తమవెంట పెద్ద ఎత్తున రకరకాల మెడిసిన్స్ తీసుకొని వెళ్తుంటారు. అయితే ఇన్నాళ్లు ఇలా తీసుకెళ్లిన వాళ్లకు పెద్దగా ఆంక్షలు ఉండేవి కావు. కానీ తాజాగా అమెరికా పలు ఆంక్షలు పెట్టింది.
దాంతో భారతీయులకు గట్టి షాక్ అనే చెప్పాలి ఈ సంఘటన. ఎందుకంటే అమెరికాలో ఈ మందులు చాలా ఖరీదైనవి కావడంతో భారత్ నుండే తీసుకెళ్తున్నారు. అక్కడ జీతాలు ఎక్కువే అలాగే ఇన్సూరెన్స్ తో పాటుగా జీవన విధానానికి అయ్యే ఖర్చులు కూడా ఎక్కువే ! దాంతో భారత్ నుండి వెళ్లే వాళ్ళు వాళ్లకు అవసరమైన మందులను ఇక్కడ నుండే తీసుకెళ్ళేవాళ్ళు. కానీ ఇక నుండి అలా తీసుకెళ్లడానికి వీలులేదు ఎందుకంటే డాక్టర్ ప్రిస్కిప్షన్ ఉంటేనే ఆ మందులను అనుమతిస్తారు లేకపోతే అనుమతి ఇవ్వరు. డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి చేసారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ తో పాటుగా ఆ మందులు ఏ రకంగా పనిచేస్తాయి …… దేని కోసం వాడుతున్నారనే వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ఇది తప్పకుండా భారతీయులకు పెద్ద తలనొప్పి అనే చెప్పాలి.
Breaking News