భారత సంతతికి చెందిన రిషి సునాక్ అదృష్టం ఎలా ఉందో మరో నెల రోజుల్లో తేలిపోనుంది. బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడంతో బ్రిటన్ లో ప్రధాని పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ పదవికి భారత మూలాలున్న రిషి సునాక్ పోటీ పడుతున్నాడు. పార్లమెంట్ సభ్యులలో మెజారిటీ సభ్యుల మద్దతుతో రేసులో శరవేగంగా దూసుకుపోతున్న సమయంలో బోరిస్ జాన్సన్ తెరవెనుక మంత్రాంగం నడిపించడంతో కాస్త వెనుకబడ్డాడు.
కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు 1,75,000 మంది ఉన్నారు. ఇందులో మెజారిటీ సభ్యులు ఎవరికి మద్దతుగా నిలుస్తారో వాళ్లే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి ప్రధాని అవుతారు. అయితే ఆ అదృష్టం రిషి సునాక్ ని వరిస్తుందనే నమ్మకంతో ఉన్నారు భారతీయులు. అయితే లిజ్ ట్రస్ కూడా గట్టి పోటీ ఇస్తోంది రిషి సునాక్ కు . ఇక ఈ ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో సెప్టెంబర్ 5 న ఫలితం తేలనుంది. ఒకవేళ రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయితే చరిత్ర సృష్టించిన వ్యక్తిగా నిలిచిపోతాడు. మరి ఆ అదృష్టం వరిస్తుందా ? లేదా ? అన్నది చూడాలి.